/rtv/media/media_files/2024/12/12/dSQWriwQX88uL21nke7W.jpg)
మోహన్‌బాబు మరో ఆడియో ప్రకటన రిలీజ్ చేశారు. జర్నలిస్టులపై దాడి చేయడం పట్ల చింతిస్తున్నట్లు ప్రకటించారు. తాను వారిని కొట్టాలని దైవ సాక్షిగా అనుకోలేదని చెప్పారు. తన ఇంట్లోకి దూసుకొస్తున్నది జర్నలిస్టులా కాదా అన్నది తనకు తెలియదని...ఆవేశంలో చూసుకోకుండా కొట్టానని మోహన్‌బాబు చెప్పారు.
Also Read: మహిళలకు శుభవార్త.. నెలకు రూ.2,100 ఆర్థిక సాయం
నిజ జీవితంలో నటించే అవసరం లేదు..
కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా.. ప్రజలు , రాజకీయ నాయకులు ఇది బాగా ఆలోచించాలి. మీడియాను అడ్డుపెట్టుకొని నాపై దాడి చేసే అవకాశం ఉందని ఆలోచించా. చీకట్లో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది. మీడియా ప్రతినిధికి తగిలిన దెబ్బకు నేను బాధపడుతున్నాను. కానీ నా గురించి ఎవరూ ఆలోచించడం లేదు. నేను సినిమాల్లో నటించాను తప్ప నిజజీవితంలో నటించే అవసరం నాకు లేదు అంటూ చెప్పుకొచ్చారు మోహన్ బాబు.
Also Read: మంచు ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన సీపీ.. ఏడాదిపాటు బాండ్ ఓవర్!
సాహసంగా, నీతిగా బతకాలన్నదే ఎప్పుడూ తన ఆలోచన అని మోహన్‌బాబు అన్నారు. నేను అసభ్యంగా ప్రవర్తించి ఉంటే నా మీద 50 కేసులు పెట్టవచ్చు. నా బిడ్డే నా ప్రశాంతతను చెడగొడుతున్నాడు. మేం కూర్చొని మాట్లాడుకుంటాం. ఏదో ఒక రోజు మా సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబసభ్యుల గొడవకు మధ్యవర్తులు అవసరం లేదు. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. అవన్నీ మరిచిపోయి నేను కొట్టిన విషయం ప్రస్తావిస్తున్నారు. నేను చేసిన తప్పును సమర్ధించుకోవడం లేదు. కానీ ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలి. మీకు టీవీలు ఉండొచ్చు, నేను కూడా రేపు టీవీ పెట్టొచ్చు. నేను మీడియా ప్రతినిధిని కొట్టినందుకు చింతిస్తున్నాను అంటూ మోహన్ బాబు మొత్తం 11 నిమిషాల ఆడియోను విడుదల చేశారు.
Also Read: తల దించుకోవాల్సి వస్తోంది.. పార్లమెంటులో నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
Also Read: ట్రంప్ బాధ్యతలు చేపట్టకముందే రాజీనామా చేస్తా: ఎఫ్‌బీఐ డైరెక్టర్!