/rtv/media/media_files/2025/04/14/crU8noh30kKC7eawoiMp.jpg)
Sabarimala gold lockets
అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం గుడ్ న్యూస్ తెలిపింది. అయ్యప్ప రూపంలో ఉన్న బంగారు లాకెట్ల పంపిణీని శబరిమల దేవస్థానం ప్రారంభించింది. గర్భ గుడిలో పూజించిన బంగారు లాకెట్ల పంపిణీని కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ ప్రారంభించారు. అయితే బంగారు లాకెట్‌ను ఆన్‌లైన్‌లో ఏపీకి చెందిన వ్యక్తి బుక్ చేసుకున్నాడు. అతనికే మొదటగా ఈ బంగారు లాకెట్‌ను మంత్రి వాసవన్ అందజేశారు. ఆ తరువాత శబరిమల తంత్రి కందరారు రాజీవరు, టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్, బోర్డు సభ్యుడు ఏ అజికుమార్ మిగిలిన భక్తులకు లాకెట్లను పంపిణీ చేశారు.
ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!
தங்க லாக்கெட்டுகள்https://t.co/WciCN2SQmv | #Kerala | #Sabarimalai | #AiyyappanTemple | #GoldLockets | #News7Tamil | #News7TamilUpdatespic.twitter.com/A1DF7im6P8
— News7 Tamil (@news7tamil) April 14, 2025
ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?
లాకెట్ల ధరలు
2 గ్రాములు, 4 గ్రాములు, 8 గ్రాముల్లో ఈ లాకెట్‌లను తయారు చేశారు. అయితే 2 గ్రాముల బంగారు లాకెట్ ధర రూ.19,300గా నిర్ణయించారు. 4 గ్రాముల లాకెట్ ధర రూ.38,600, 8 గ్రాముల బరువున్న బంగారు లాకెట్ ధర రూ.77,200గా శబరిమల దేవస్థానం నిర్ణయించింది. రెండు రోజుల కిందట బుకింగ్ ప్రారంభం కాగా మొత్తం 100 మంది భక్తులు ఆ లాకెట్లను బుక్ చేసుకున్నారు.
ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!
ఈ బంగారు లాకెట్లను భక్తులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. తమిళనాడుకు చెందిన జీఆర్‌టీ జ్యువెల్లర్స్, కేరళకు చెందిన కల్యాణ్ జ్యువెల్లర్స్ ఈ బంగారు లాకెట్లను తయారు చేసి సప్లై చేసే టెండర్లను దక్కించుకున్నాయి. మలయాళ క్యాలెండర్ ప్రకారం ఏడాదిలోని మొదటి రోజు విషు. ఈ సందర్భంగా బంగారు లాకెట్లను పంపిణీ చేశారు.
ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..
Gold Lockets | ayyappa-devotees | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | breaking news in telugu