Telangana Police: అయ్యప్ప దీక్షలో డ్యూటీ చేయకండి.. పోలీసు శాఖ సంచలన ఆదేశం
మతపరమైన దీక్షలపై తెలంగాణ పోలీసు శాఖ సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీక్షలు తీసుకుంటే సెలవులు తీసుకోవాలని.. డ్యూటీలో ఉంటూ దీక్షలు చేయడానికి అనుమతి లేదని తేల్చిచెప్పింది.
మతపరమైన దీక్షలపై తెలంగాణ పోలీసు శాఖ సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీక్షలు తీసుకుంటే సెలవులు తీసుకోవాలని.. డ్యూటీలో ఉంటూ దీక్షలు చేయడానికి అనుమతి లేదని తేల్చిచెప్పింది.
కేరళలో మరో కొత్త వ్యాధి విజృంభిస్తోంది. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.
పవిత్ర గోదావరి నది తీరాన కొలువైన అయ్యప్ప స్వామి ఆలయం, శబరిమల ఆలయాన్ని తలపించేలా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి ప్రాంతంలో కొలువై ఉన్న ఈ ఆలయం, కార్తీక మాసం, మండల పూజల సమయంలో అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది
అయ్యప్పమాల ధరించి పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని యాజమాన్యం అనుమతించలేదు. దీంతో వివాదం చెలరేగింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి జీఐజీ ఇంటర్నేషనల్ స్కూల్లోచోటు చేసుకుంది. దీక్ష తీసుకున్న 5వతరగతి విద్యార్థిని అనుమతించకపోవడంతో దీక్షధారులు ఆందోళనకు దిగారు.
ట్రావెన్కోర్ దేవస్థానం అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ తెలిపింది. గర్భ గుడిలో పూజించిన బంగారు లాకెట్ల పంపిణీని కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ ప్రారంభించారు. అయితే మొదట ఈ బంగారు లాకెట్‌ను ఆన్లైన్లో ఏపీకి చెందిన వ్యక్తి బుక్ చేసుకున్నాడు.
శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే టీడీబీ యాత్రికుల కోసం ఉచిత బీమా పథకాన్ని తీసుకువచ్చింది. పతనంతిట్ట, కొల్లాం, అలప్పుజా జిల్లాల పరిధిలో ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తుంది. ఇందుకుగానూ ఎలాంటి రుసుము తీసుకోదు.
తెలుగు రాష్ట్రాల శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే మరో 34 సర్వీసులను నడపనుంది. అయ్యప్ప భక్తులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.
రైళ్లలో పూజలు నిర్వహించవద్దని దక్షిణ మధ్య రైల్వే శాఖ శబరిమల భక్తులకు కీలక సూచనలు చేసింది. కోచ్‌లో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం వంటివి చేస్తే సెక్షన్‌లోని 67, 154, 164, 165 ప్రకారం మూడేళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని తెలిపింది.