/rtv/media/media_files/2025/07/12/russian-woman-found-living-in-cave-with-2-daughters-in-karnataka-2025-07-12-18-42-01.jpg)
Russian Woman Found Living In Cave With 2 Daughters In Karnataka
Russian Woman : భారతీయ ఆధ్యాత్మికతకు ఆకర్షితులు కానీ వారంటూ లేరు. కేవలం మనదేశీయులే కాకుండా విదేశీయులు సైతం మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతకు ఆకర్షితులు అవుతుండటం మనం చూస్తున్నాం. ఓ రష్యన్ మహిళ కూడా భారతీయ ఆధ్యాత్మికతకు ఆకర్షితురాలు కావడమే కాకుండా ఏకంగా ఒక దట్టమైన అడవిలో ఉన్న గుహలో ధ్యానంలో మునిగి పోయింది. అంతేకాదు, ఆమెతో పాటు ఆరు, నాలుగేళ్ల వయస్సున్న తన పిల్లలు కూడా అక్కడే ఉండటం గమనార్హం. అయితే పెట్రోలింగ్ కోసం అడవుల్లోకి వెళ్లిన పోలీసులకు ఈ విషయం తెలిసి అవాక్కయ్యారు.
Also Read: చనిపోయిందనుకుని అంత్యక్రియలు.. ఆఖరి నిమిషంలో లేచి గుక్కపెట్టి ఏడ్చిన శిశువు!
ఆధ్యాత్మికతపై అవగాహన కోసం భారతదేశానికి వచ్చిన ఓ రష్యన్ మహిళ గోకర్ణలోని దట్టమైన అడవుల్లో రహస్య జీవనం సాగిస్తోంది. ఓ చిన్న గుహలో ఆమెతో పాటు ఇద్దరు చిన్నారులతో కలిసి ధ్యానంలో మునిగిపోయింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆమెను గుహనుంచి బయటకు తీసుకువచ్చారు. ఆమెను సొంత దేశానికి తిప్పి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. వివరాల ప్రకారం..
ఉత్తర కన్నడ జిల్లాలోని కుంటా తాలుకాలో దట్టమైన అడవులున్నాయి. అక్కడి రామతీర్థ పర్వత ప్రాంతంలో స్థానిక పోలీసులు తరుచుగా పెట్రోలింగ్ నిర్వహిస్తు్ంటారు. ఎప్పటిలాగే అక్కడికి వెళ్లిన పోలీసులకు ఓ గుహ వద్ద కొన్ని దుస్తులు ఉండటాన్ని గమనించారు. దట్టమైన అడవి, కొండచరియలు విరిగిపడే ఆ ప్రమాదకరమైన ప్రాంతంలో ఎవరుంటారు అనే అనుమానం వారికి వచ్చింది. దీంతో మరింత ముందుకెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగా ఆ గుహలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. ఆశ్చర్యపోయిన పోలీసులు ఆమెను విచారించారు. ఆమె పేరు నైనా కుటినా అలియాస్ మోహిగా తెలిపింది. తనది రష్యా అని వెల్లడించింది. ఆమెకు ఆరు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
Also Read:మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!
బిజినస్ వీసాపై భారత్‌కు వచ్చిన నైనా.. హిందుత్వం, ఆధ్యాత్మికతకు ఆకర్షితురాలైంది. ఈ క్రమంలో గోవా నుంచి గోకర్ణకు వెళ్తున్న సమయంలో రామతీర్థ పర్వత ప్రాంతంలో ఈ ప్రదేశం ఆమెకు నచ్చిందట. దేవుని ద్యాసలో ధ్యానం చేయాలనుకున్న ఆమె ఆ దట్టమైన అడవుల్లో ఉన్న గుహలో ఓ చిన్న నివాసం ఏర్పరచుకొంది. అక్కడే రుద్ర విగ్రహాన్ని పెట్టుకొని నిత్యం ఆరాధిస్తూ ప్రకృతి ఒడిలో ధ్యానంలో మునిగిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. రెండువారాలుగా ఆమె అక్కడ నివసిస్తున్నట్లు గుర్తించారు.
అయితే ఆ గుహ ఉన్న రామతీర్థ కొండల్లో 2024లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. వన్యమృగాలు, అత్యంత విషపూరిత సర్పాలు ఉండే ఆ ప్రాంతంలో ఆమె ఎలా నివసించారు? ఏం తిన్నారనే దానిపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఆమెకు ఎటువంటి అపాయం జరగలేదన్నారు. అయితే, ఆమె వీసా గడువు 2017లోనే ముగిసిందని, భారత్‌లో ఎప్పటి నుంచి ఉంటున్నారనే విషయంపై స్పష్టత లేదన్నారు. ప్రస్తుతానికి స్థానిక ఆశ్రమంలో ఉంచిన అధికారులు.. రష్యన్ ఎంబసీకి సమాచారం అందించారు. త్వరలోనే ఆమెను బెంగళూరు తరలిస్తామని, అక్కడ నుంచి ఆమె దేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తామని జిల్లా పోలీసు అధికారులు వెల్లడించారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్!