/rtv/media/media_files/2025/11/02/two-ias-coaching-institutes-fined-rs-8-lakh-each-for-false-success-claims-2025-11-02-15-04-32.jpg)
Two IAS coaching institutes fined Rs 8 lakh each for false success claims
సివిల్స్ కోచింగ్ కోసం చాలామంది అభ్యర్థులు ఢిల్లీకి వెళ్తుంటారు. అయితే అక్కడ రెండు ప్రముఖ IAS కోచింగ్ సెంటర్లకు బిగ్ షాక్ తగిలింది. దీక్షంత్ ఐఏఎస్, అభిమన్యూ ఏఐఎస్ సంస్థలకు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) భారీ జరిమానా విధించింది. ఒక్కో సంస్థకు రూ.8 లక్షల చొప్పున ఫైన్ వేసింది. ఈ రెండు కోచింగ్ సెంటర్లు కూడా UPSCలో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లు తమ పర్మిషన్ లేకుండా వాడాయి. ఈ క్రమంలోనే CCPA ఈ చర్యలు తీసుకుంది.
8 Lakhs Fine For Two IAS Coaching Institutes
ఈ మధ్య కాలంలో కోచింగ్ సెంటర్లు ర్యాంకులు సాధిస్తున్న అభ్యర్థులు తమ సంస్థలోనే కోచింగ్ తీసుకున్నారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే CCPA అలాంటి కోచింగ్ సెంటర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీక్షంత్, అభిమన్యూ ఐఎఎస్ కోచింగ్ సెంటర్లు ఎలాంటి విశ్వసనీయమైన సమాచారం ఇవ్వకుండానే తమ విజయ శాతాన్ని ఎక్కువ చేసి చూపించుకున్నాయి. UPSCలో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు తమ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వాళ్లేనని ప్రచారం చేసుకున్నాయి.
ఈ క్రమంలోనే 2021లో ఆల్ ఇండియా ర్యాంక్ 96 ర్యాంక్ సాధించిన మణి శుక్లా తమ సంస్థలోనే కోచింగ్ తీసుకున్నారని దీక్షంత్ ఐఏఎస్ ప్రచారం చేసుకుంది. దీంతో మణి శుక్లా CCPAకు ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ మరో అకాడమీతో కలిసి నిర్వహించిన ఓ మాక్ ఇంటర్వ్యూకు మాత్రమే తాను హాజర్యయానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే CCPA ఆ సంస్థపై చర్యలు తీసుకుంది. అలాగే 2020లో ఆలిండియా ర్యాంక్ 175 సాధించిన నటాష గోయల్ తమ సంస్థలో కోచింగ్ తీసుకున్నట్లు అభిమన్యూ ఐఏఎస్ అకాడమీ ప్రచారం చేసుకుంది.
Also Red: సూపర్ మార్కెట్‌లో భారీ పేలుడు.. 23 మంది మృతి
తన పర్మిషన్ లేకుండా ఫొటోను వాడుకున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే CCPA అభిమన్యూ సంస్థకు కూడా జరిమానా విధించింది. అయితే ఈ సంస్థను స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా 2,200 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారని దాని యాజమాన్యం పేర్కొంది. కానీ దీనికి సంబంధించిన డేటాను మాత్రం ఇవ్వలేదు. అయితే 2023లో ఆ సంస్థ 139 అభ్యర్థులు తమ అకాడమీలోనే కోచింగ్ తీసుకున్నట్లు ప్రచారం చేసుకుంది. అయితే వీళ్లలో 88 మంది స్వయంకృషితోనే ఉద్యోగాలు సాధించారని CCPA దర్యాప్తులో వెల్లడైంది.
Follow Us