/rtv/media/media_files/2025/02/02/SmCx00vOqor9H3UhMIVq.jpg)
Ricky Ponting Predicts
ఫిబ్రవరి 19 నుండి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇప్పటికే చాలా జట్లు తమ టీమ్ లను కూడా ప్రకటించాయి. పాకిస్థాన్ , దుబాయ్ వేదికలుగా జరిగే ఈ ట్రోఫీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు. మాజీ క్రికెటర్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఛాంపియన్స్ ట్రోఫీలో తన రెండు ఫేవరెట్ టీమ్ లను వెల్లడించాడు.
పాకిస్థాన్ కూడా పోటీ
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్ కు వెళ్తాయని జోస్యం చెప్పాడు. ఈ రెండు జట్లు రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నట్లుగా వెల్లడించాడు. వీటికి పోటీగా హోం గ్రౌండ్ కావడంతో పాకిస్థాన్ కూడా పోటీ కావచ్చునని అభిప్రాయపడ్డాడు. పాక్ అంచనాలకు దొరకకుండా ఆటను ప్రదర్శిస్తుందన్నాడు. పాంటింగ్ కామెంట్స్ ను రవిశాస్ట్రి ఏకభవించాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీని రెండుసార్లు గెలుచుకున్న రెండు జట్లు భారత్, ఆస్ట్రేలియా మాత్రమే. 2006, 2009లో ఆస్ట్రేలియాను బ్యాక్ టు బ్యాక్ టైటిళ్లను గెలుచుకోగా.. 2013లో ఇంగ్లండ్‌పై భారత్ గెలిచింది. 2002లో శ్రీలంకతో టైటిల్‌ను పంచుకుంది.
ఆస్ట్రేలియా జట్టు ఇదే
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషాగ్నే, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా.
ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లేముందు ఆసీస్ కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వెన్నునొప్పి కారణంగా ట్రోఫీ నుండి వైదొలిగాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. మార్ష్ లేకపోవడం వల్ల ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్‌లో అలెక్స్ కారీతో భర్తీ చేసే అవకాశం ఉంది.
Also Read : ఇదేం ట్విస్టురా మామా.. ఆ పాటకు వరుడు డ్యాన్స్ చేశాడని పెళ్లి క్యాన్సిల్