/rtv/media/media_files/2025/02/02/WbuWUiz5LqkarA2MAL5m.jpg)
komaki electric scooters company launch SE Pro, SE Ultra and SE Max series
ప్రస్తుతం భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కారణంగా చాలా మంది వాహన ప్రియులు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైనే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కొత్త కొత్త కంపెనీలు దేశంలో ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో అనేక స్టార్టప్ కంపెనీల నుంచి దిగ్గజ కంపెనీల వరకు ఈవీలతో మార్కెట్ లో పోటీ పడుతున్నాయి.
ఇందులో భాగంగానే ఓలా, బజాజ్, ఏథర్, టీవీఎస్ వంటి దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో మంచి పేరు సంపాదించుకున్నాయి. అయితే వీటికంటే ముందు ఈవీల రంగంలోకి కొమాకి అనే టూవీలర్ సంస్థ వచ్చింది. ఎన్నో రకాల మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త కొత్త మోడళ్లను మార్కెట్ లో లాంచ్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
Also Read : జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే... సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!
లక్షలోపు ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేసింది. ఫీచర్లలోనూ తోపు స్కూటర్ కంపెనీగా నిలిచింది. ఇక అదే జోష్ లో ఈ ఏడాది తన లైనప్ లో ఉన్న ఎస్ఈ సిరీస్ లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది.
మోడల్, ధర
ఇందులో మూడు మోడళ్లు ఉన్నాయి. అవి SE Pro, SE Ultra, SE Max మోడళ్లు. వీటి ధరలు కూడా చాలా తక్కువగానే ఉండటంతో వాహన ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. వీటి ధరలు వరుసగా రూ.67,999, రూ. 76,999, రూ.1,10,000 ఎక్స్- షోరూమ్ ధరగా ఉన్నాయి.
🚀 Unveiling the Future of Electric Scooters!
— 91Wheels.com (@91wheels) January 22, 2025
Komaki Electric launches the sporty SE Series with three advanced models:
✨ SE PRO - ₹67,999* | 110-120 km range
✨ SE ULTRA - ₹76,999* | 130-140 km range
✨ SE MAX - ₹1,10,000* | 200+ km range
💡 Built for speed, style, and… pic.twitter.com/Aj64rPcLRV
Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మైలేజ్
SE Pro మోడల్ 2.75kW nagr బ్యాటరీని కలిగి ఉంది. ఇది సింగిల్ ఛార్జింగ్ తో 110 నుంచి 120 కి.మీ మైలేజీ అందిస్తుంది. అలాగే SE Ultra ఎలక్ట్రిక్ వెహికల్ భారీ మైలేజ్ ను అందిస్తుంది. ఇందులో 2.7 kWh లిథియం పాస్ఫేట్ 4 బ్యాటరీతో ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 130 నుంచి 140 కి.మీ మైలేజీ అందిస్తుంది. అలాగే SE Max ఈవీ మరింత ఎక్కువ మైలేజీ ఇస్తుంది. ఇందులో 4.2 kWh లిథియం పాస్ఫేట్ 4 బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జింగ్ పై 200 కి.మీ మైలేజీ అందిస్తుంది.
ఫీచర్స్
ఇక ఇందులో అధునాతన, అద్భుతమైన ఫీచర్లు అందించబడ్డాయి. TFT స్క్రీన్స్, డ్యూయల్ ఛార్జర్స్, సింగిల్ డిస్క్, డిజిటల్ స్పీడోమీటర్, డ్యూయల్ డిస్క్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇవి మహిళలకు అత్యంత సౌకర్యవంతంగానూ, కంఫట్ బుల్ గానూ ఉండటంతో చాలా మంది వీటిని కొనేస్తున్నారు. ధర కూడా తక్కువ కావడంతో ఆసక్తి చూపిస్తున్నారు.