Wedding: ఇదేం ట్విస్టురా మామా.. ఆ పాటకు వరుడు డ్యాన్స్ చేశాడని పెళ్లి క్యాన్సిల్‌

ఢిల్లీలోని ఓ పెళ్లిలో వరుడికి మాత్రం ఊహించని షాక్ తగిలింది. పెళ్లి వేడుకల్లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్‌ చేయగా.. చివరికి ఆ వివాహమే రద్దయిపోయింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Groom Dances To Choli Ke Peeche, Bride's Father Calls Off Wedding

Groom Dances To Choli Ke Peeche, Bride's Father Calls Off Wedding

పెళ్లి వేడుకలప్పుడు ఇల్లంతా సందడి వాతావరణం ఉంటుంది.  బంధువులు, స్నేహితులతో ఆట, పాటలతో సరదాగా గడుపుతారు. అయితే ఓ పెళ్లిలో వరుడికి మాత్రం ఊహించని షాక్ తగిలింది. పెళ్లి వేడుకల్లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్‌ చేయగా.. చివరికి ఆ వివాహమే రద్దయిపోయింది. ఢిల్లీలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Also Read: ఢిల్లీలో గెలిచేది ఆ పార్టీయే.. ప్రీపోల్‌ సర్వేలో సంచలన విషయాలు

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో ఓ పెళ్లికొడుకు తన పెళ్లి ఊరేగింపుతో వివాహ వేదిక వద్దకు వచ్చాడు. అదే సమయంలో అతడి స్నేహితులు డ్యాన్స్ చెద్దామని వరుడిని పిలిచారు. ఈ నేపథ్యంలోనే 'చోలీ కే పీఛే క్యాహే' అనే బాలీవుడ్‌ పాటకు వాళ్లు డ్యాన్స్ చేశారు. ఈ పాటకు పెళ్లి కొడుకు డ్యాన్స్ చేడయమే అతడి కొంప ముంచింది. వరుడి డ్యాన్స్ చాలా అనుచితంగా ఉందని.. తనకు కాబోయే మామ ఆ పెళ్లి వేడుకలను ఆపేశాడు.     

Also Read: ఆ బాలీవుడ్ నటుడికి ఫిదా అయిన కుంభమేళా బ్యూటీ మోనాలిసా.. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే?

పెళ్లి రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. వరుడు తన తీరుతో కుటుంబ విలువల్ని అవమానించడాని వధువు తరఫు బంధువులు చెప్పారు. అయితే ఇతందా సరదా కోసమే చేశానని అతడు వివరణ ఇచ్చినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడంతో వధువు కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వధువు తండ్రి చేసిందని సరైందని కొందరు అంటుడంగా మరికొందరు దాన్ని ఖండిస్తున్నారు. 

Also Read: ఇది పెళ్లాం కాదు బాబోయ్.. ప్రియుడి కోసం భర్త కిడ్నీనే..

Also Read: కుంభమేళాలో 'అయోధ్య రామ మందిరం'.. తెలుగు వ్యక్తి టాలెంట్ కి ఫిదా అయిన భక్తులు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు