ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కొరియన్ వెదురు ఉప్పు అత్యంత ఖరీదైనది. 250 గ్రాముల ఉప్పు ధర దాదాపుగా రూ.7500 ఉంటుంది. ఈ ఉప్పును తినడం వల్ల అనారోగ్య సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడి నుంచి కూడా విముక్తి పొందుతారు.

New Update
Salt

Salt Photograph: (Salt)

వంటలు రుచిగా ఉండాలంటే ఉప్పు అనేది తప్పనిసరి. ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉప్పు అనేది ఉంటుంది. అయితే ఈ ఉప్పు క్వాలిటీ బట్టి ధరలు ఉంటాయి. అలాగే ఒక్కో దేశంలో ఒక్కో ధర ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు కూడా ఉంది. అదే కొరియన్ వెదురు ఉప్పు. దీనిని కొనాలంటే మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎందుకంటే ఈ ఉప్పు 250 గ్రాముల ధర దాదాపుగా రూ.7500 ఉంటుంది. ఇది ఎక్కువగా కొరియన్ దేశాల్లో మాత్రమే పండిస్తారు. పర్పుల్ వెదరు లేదా జుగ్యోమ్ అనే పిలిచే ఈ ఉప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Papaya Side Effects: వీరు పొరపాటున బొప్పాయి తింటే.. సమస్య పెరగడం ఖాయం

రోగనిరోధక శక్తిని పెంచడంలో..

ఈ వెదురు ఉప్పులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి మంటలను తగ్గించడంతో పాటు కీళ్ల నొప్పులను కూడా క్లియర్ చేస్తుంది. అలాగే గొంతు నొప్పి, నోటి పూతలు, వాపు వంటి సమస్యలు రాకుండా చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిస్ సమస్యను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని ఫ్రీరాడికల్స్ చర్య సమస్యలను కూడా క్లియర్ చేస్తాయి. ఒత్తిడి నుంచి విముక్తి పొందడంతో పాటు జీర్ణ సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు అంటున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. 

ఇది కూడా చూడండి: Dengue: బొప్పాయి ఆకులు నిజంగానే ప్లేట్లెట్స్ ను పెంచుతాయా? సైన్స్ ఏం చెబుతోంది?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు