/rtv/media/media_files/2025/10/01/recording-dance-video-1-2025-10-01-20-54-16.jpg)
Recording Dance Video
దేశ వ్యాప్తంగా పలు రాష్రాల్లో ఉత్సవాలకు, పండుగలకు.. ఇతర కార్యక్రమాలకు రికార్డింగ్ డ్యాన్సు(Recording Dance) ల ఈవేంట్లు నిర్వహిస్తుంటారు. ఈ ఈవెంట్లో అమ్మాయిలు అశ్లీల డ్యాన్సులు చేస్తూ యువతను ఉర్రూతలూగిస్తుంటారు. ముఖ్యంగా ఏపీలో ఇలాంటి కల్చర్ ఉంటుంది. ప్రతి పండుగ, ఫెస్టివల్స్‌కు నిర్వాహకులు వీటిని చాలా సీక్రెట్‌గా నిర్వహిస్తుంటారు. వీటిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కొందరు ఊరి చివార్లలో రహస్యంగా చేస్తుంటారు.
ఇలాంటిదే తాజాగా మరొక రికార్డింగ్ డ్యాన్స్ ఈవెంట్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇప్పుడంతా దసరా(Dussehra 2025) ఉత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బార్ డ్యాన్సర్లు అశ్లీల డ్యాన్సులు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే అది ఏపీలో కాదు. ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం.
Also Read : దేశంలోనే అత్యంత సంపన్న మహిళ ఈమెనే.. ఆస్తి ఎంతో తెలుసా?
Recording Dance Video Viral
అయోధ్య(ayodhya) లోని ఖండ్సా బజార్‌లో దుర్గా పూజ వేడుకలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడి నిర్వాహకులు పండల్ సమీపంలో ఒక రికార్డింగ్ డ్యాన్సు ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. దీని కోసం దాదాపు ఐదు మంది యువతులను తీసుకొచ్చారు. వారు బార్ డ్యాన్సర్లు. ఆ ఐదుగురు యువతులు అశ్లీల పాటలకు డ్యాన్సులు చేశారు. వారిని చూసేందుకు యువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
ఈ ఈవెంట్లో బార్ డ్యాన్సర్లు అశ్లీల డ్యాన్సులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ఐదుగురు మహిళలు అశ్లీల పాటలకు డ్యాన్సులు చేస్తుండగా.. అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు వారిని చూస్తూ ఉత్సాహపరిచారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. అయితే ఇక్కడ విస్తుపోయే విషయం ఏంటంటే.. ఈ సంఘటన ఖండ్సా పోలీస్ స్టేషన్‌కు అతి కొద్ది దూరంలోనే జరిగింది.
అయినప్పటికీ అక్కడ ఉన్న పోలీసులు జోక్యం చేసుకోకపోవడంతో.. అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. మతపరమైన కార్యక్రమం ముసుగులో ఇలాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారంటూ పలువురు మండిపడుతున్నారు. అదే సమయంలో పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.
కాగా నవరాత్రికి ముందు జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ నిర్వాహకులందరికీ పలు సూచనలు జారీ చేశాయి. మతపరమైన కార్యక్రమాల సమయంలో ఎలాంటి అశ్లీలత లేదా సాంస్కృతిక నిబంధనల ఉల్లంఘనను నివారించాలని తెలిపాయి. ఒకవేళ ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడంతో పలువురు మండిపడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈవెంట్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read : సీఎం మార్పుపై సిద్ధరామయ్య సంచలన కామెంట్స్