Siddaramaiah: సీఎం మార్పుపై సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కుణిగల్‌ ఎమ్మెల్యేతో పాటు మరికొందరు పార్టీ నేతలు డీకే శివ కుమార్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నామని డిమాండ్ చేయడం సంచలనం రేపింది.

New Update
CM Siddaramaiah

CM Siddaramaiah

కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కుణిగల్‌ ఎమ్మెల్యేతో పాటు మరికొందరు పార్టీ నేతలు డీకే శివ కుమార్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నామని డిమాండ్ చేయం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై సీఎం సిద్ధరామయ్య(siddaramaiah) స్పందించారు. ఐదేళ్ల పదవీకాలానికి తానే ముఖ్యమంత్రిగా ఉంటానని తేల్చిచెప్పారు. '' 5 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటాను. వచ్చే సంవత్సరం మైసూరు దసరా ఉత్సవాల్లో పుష్పార్చన చేస్తాను. హైకమాండ్‌ ఏది నిర్ణయించినా దానికి కట్టుబడి ఉండాల్సిందేనని'' పేర్కొన్నారు. 

CM Siddaramaiah Says I Willbe CM For Full Of 5 Years

Also Read: భారత్‌లో పుతిన్‌ పర్యటన ఖరారు.. రష్యా అధ్యక్షుడి రాకకు ఓ ప్రత్యేకత!

ఇదిలాఉండగా ఇటీవల కుణిగల్ ఎమ్మెల్యే హెచ్‌డీ రంగనాథ్‌ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి ఎంతగానో కృషి చేసిన తన గురువు డీకే శివకుమార్‌ను హైకమాండ్ గుర్తించాలన్నారు. తన రాజకీయ గురువైన శివకుమార్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ఓటర్లు కూడా అదే కోరుకుంటున్నట్లు తెలిపారు. అధిష్ఠానం కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని పేర్కొన్నారు.  

Also Read: POKలో 8 మంది పాక్ పౌరులు మృతి.. బరితెగించిన పాకిస్తాన్ ఆర్మీ

Advertisment
తాజా కథనాలు