/rtv/media/media_files/2025/09/01/supreme-court-2025-09-01-20-13-48.jpg)
Supreme Court
దివ్యాంగులకు(disabled people) సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాళ్లను కించపరిచే వారిపై చర్యలు తీసుకునేందుకు ఎస్సీ/ఎస్టీ లాంటి కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపింది. దీనిపై ఆలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. యూట్యూబర్లు రణ్‌వీర్ అలహాబాదియా, సమయ్ రైనాలకు సంబంధించి పిటిషన్లు విచారించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు కండరాల క్షీణతకు సంబంధించి బాధితులతో కలిసి అవగాహన కల్పిస్తూ ఓ ప్రదర్శన నిర్వహించాలని సమయ్ రైనాకు సూచించింది.
Also Read: అయోధ్యపై పాక్ కారుకూతలు..స్ట్రాంగ్ కౌంటరిచ్చిన భారత్
Supreme Court Directs Samay Raina To Invite Disabled People
ఇక వివరాల్లోకి సమయ్ రైనా ఓ ఆన్‌లైన్ షోలో వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న ఓ చిన్నారికి ఔషధాల గురించి వివరిస్తూ వాళ్లని కించపరిచే విధంగా మాట్లాడాడు. దీంతో ఈ షోలో పాల్గొన్న వాళ్లపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ వ్యాధిపై పోరాడుతున్న ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై సీరియస్ అయిన కోర్టు.. ఆ షోలో పాల్గొన్న వాళ్లు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సమయ్ రైనా క్షమాపణలు చెప్పాడు.
గురువారం రణ్‌వీర్ అలహాబాదియా, సమయ్ రైనాలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ బాధితుల తరఫున వాదనలు వినిపించారు. కమెడియన్ చిన్నారులను కించపరిచే విధంగా మాట్లాడాడని పేర్కొన్నారు. ఇలా మాట్లాడితే క్రౌడ్ ఫండింగ్‌కు ఇబ్బంది అవుతుందని పేర్కొన్నారు.
Also Read: రూ.2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లు డిలీట్..UIDAI షాకింగ్ నిర్ణయం!
ఈ క్రమంలోనే దివ్యాంగులను కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే ఎస్సీ/ఎస్టీ చట్టం లాగే కఠినమైన చట్టం అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి చట్టాలు తీసుకొచ్చే అంశంపై ఆలోచన చేయాలని సూచనలు చేసింది. వాళ్లకి కావాల్సిన గౌరవ మర్యాదలను, వారు సాధించిన విజయాలు చూపించేందుకు ఆన్‌లైన్ షోను ఉపయోగించాలంటూ యూట్యూబర్‌కు సూచించింది. ఇలాంటి షోలకు దివ్యాంగులను ఆహ్వానించి, దానితో వచ్చే ఫండ్స్‌ను బాధితుల చికిత్సకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Follow Us