/rtv/media/media_files/2025/11/27/trump-calls-white-house-shooting-an-act-of-terror-2025-11-27-15-10-16.jpg)
trump calls White house shooting an act of terror
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్(white-house) సమీపంలోని కాల్పులు జరగడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది ఉగ్రదాడేనని ట్రంప్(Donald Trump) ధ్వజమెత్తారు. ఈ దాడులకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కారణమని పరోక్షంగా విమర్శలు చేశారు. కాల్పుల తర్వాత అదుపులోకి తీసుకున్న వ్యక్తి అఫ్గానిస్థాన్‌కు చెందిన వాడని అన్నారు. అతడు జో బైడెన్ అధికారంలోకి ఉన్నప్పుడే ప్రవేశించాడని ఆరోపించారు. బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు అఫ్గాన్ నుంచి వచ్చిన వాళ్లను మళ్లీ విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాల్పులు జరగడంతో వాషింగ్టన్‌లో మరో 500 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
Also Read: అయోధ్యపై పాక్ కారుకూతలు..స్ట్రాంగ్ కౌంటరిచ్చిన భారత్
Trump Calls White House Shooting An Act Of Terror
కాల్పులు చేసిన నిందితుడు అఫ్గానిస్థాన్(afghanistan)కు చెందిన రెహ్మనుల్లా లఖన్‌వాల్ అని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెల్లడించారు. 2021లో అఫ్గానిస్థానీయులకు ఇచ్చిన స్పెషల్ వీసాపై అమెరికాకు వచ్చినట్లు పేర్కొన్నారు. కాల్పుల్లో నిందితుడికి గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించామని.. అయితే అతడు ఒక్కడే ఈ దాడికి పాల్పడ్డట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు జరడంతో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) సంచలన నిర్ణయం తీసుకుంది. అఫ్గానిస్థాన్ ఇమిగ్రేషన్ దరఖాస్తులు వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. అమెరికన్ల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు నేషనల్ గార్డులు కూడా మృతి చెందినట్లు వెస్ట్ వర్జీనియా గవర్నర్ చెప్పారు. కానీ వాళ్లు చనిపోలేదని తీవ్రంగా గాయాలపాలయ్యారని డైరెక్టర్ కాష్ పటేల్ అన్నారు.
Also Real: తల్లి చేసిన పాపానికి 6ఏళ్లు జైలులో పసిపాప.. మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్
గతంలో కూడా వైట్‌హౌస్ వద్ద కాల్పులు జరిగిన సంఘనలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు. అక్టోబర్‌లో ఓ కారు ఏకంగా వైట్‌హౌస్ గేటునే ఢీకొంది. ఇక 2023 మేలో సాయి వర్షిత్ అనే తెలుగు యువకుడు కిరాయి ట్రక్కుతో వైట్‌హౌస్ వద్ద బారికేడ్లను ఢీకొట్టాడు. నాజీ భావజాలంతో వెళ్లిన అతడు డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించినట్లు అధికారులు తెలిపారు. అప్పట్లో ఇది సంచలనం రేపింది.
ప్రపంచంలో అత్యంత భద్రత ఉండే ప్రదేశాల్లో వైట్‌హౌస్ ఒకటి. కానీ ఇక్కడ కూడా అప్పుడప్పుడు నిరసనలు, దాడులు జరుగుతుంటాయి. అయితే అఫ్గాన్‌కు చెందిన అతడు తాజాగా వైట్‌హౌస్ వద్ద ఎందుకు కాల్పులు జరిపాడనేదానిపై క్లారిటీ లేదు. ప్రసుతం అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
Follow Us