/rtv/media/media_files/2025/08/01/rahul-gandhi-2025-08-01-17-37-50.jpg)
Rahul Gandhi
కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కోసం కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపణలు చేశారు. దీన్ని నిరూపించేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయని పేర్కొన్నారు. అయితే రాహుల్ ఆరోపణలను ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ చేపట్టారు.
Also Read: రేపే పీఎం కిసాన్.. ఈ పని చేయకపోతే డబ్బులు రావు.. అన్నదాతలకు అలర్ట్!
తాజాగా ఎన్నికల సంఘం ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. ఈ ఓటరు జాబితా ప్రక్రియను రాహుల్‌గాంధీ ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రస్థాయి నుంచి ఓట్ల చోరీ జరుగుతోందని మాకు ఎప్పటినుంచో అనుమానాలున్నాయన్నారు. లోక్‌సభ ఎన్నికలతో సహా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు. ఓటరు సవరణ ప్రారంభించి కోట్లాదిమంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారని ఆరోపించారు. దీని గురించి అధ్యయనం చేశార ఎన్నికల సంఘం బాగోతం బయటపడిందన్నారు.
ఇది దేశ ద్రోహం
6 నెలల పాటు తామే సొంతంగా దీనిపై విచారణ చేసి ఆటమ్ బాంబు లాంటి ఆధారులు సేకరించినట్లు పేర్కొన్నారు. ఆ బాంబు పేలిన రోజు ఎలక్షన్ కమిషన్ దాక్కునేందుకు ఛాన్సే ఉండదని ధ్వజమెత్తారు. బీజేపీ కోసమే ఎన్నికల సంఘం ఓట్ల చోరీ చేస్తోందని.. ఇది దేశ ద్రోహం కన్నా తక్కువేం కాదన్నారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లలో ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేది లేదన్నారు. అధికారులు పదవీ విరమణ చేసినా.. ఏ చోట దాక్కున్న మేము కనిపెడతామని రాహుల్‌గాంధీ హెచ్చరించారు.
Also Read: పాక్, బంగ్లాపై ట్రంప్ టారిఫ్ మినహాయింపు.. భారత్‌పై అమెరికా కుట్ర!
రాహుల్‌ని పట్టించుకోకండి
మరోవైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఆయన నిరాధార ఆరోపణలు చేశారంటూ మండిపడింది. ఇలాంటి బెదిరింపులను తాము పట్టించుకోమని చెప్పింది. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన మాటలను ఎవరూ పట్టించుకోవద్దని తమ అధికారులకు చెప్పినట్లు ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. ఇదిలాఉండగా బిహర్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. జనాలను ఆకర్షించేందుకు కొత్త కొత్త స్కీమ్స్ ప్రకటిస్తున్నాయి. ఇటీవల సీఎం నితీశ్ కుమార్ తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని.. అలాగే వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు.
telugu-news | rtv-news | Rahul Gandhi | bihar-elections | voters | national news in Telugu | latest-telugu-news