/rtv/media/media_files/2025/07/17/pm-kisan-amount-status-check-1-2025-07-17-11-36-10.jpg)
PM Kisan amount status check
PM Kisan Yojana: దేశంలో చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికం సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన’ అనే పథకాన్ని గతంలో ప్రారంభించింది. రైతులకు కనీస ఆదాయ మద్దతు కల్పించడమే ఈ స్కీం ముఖ్య ఉద్దేశ్యం. దీని ద్వారా వ్యవసాయ ఖర్చులకు, ఇతర కుటుంబ అవసరాలకు ఆర్థికంగా రైతులను ఆదుకునేందుకు, రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే దీని లక్ష్యం.
Also Read:‘కింగ్డమ్ 2’లో మరొక స్టార్ హీరో.. నిర్మాత నాగవంశీ అఫీషియల్ అప్డేట్
PM Kisan Yojana 20th Installment Date
ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ఏడాది రూ.6వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలలో చెల్లిస్తారు. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి రూ.2వేల చొప్పున నేరుగా రైతుల అకౌంట్‌లో వేస్తారు. ఈ పథకం కింద దేశంలోని కోట్లాది మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.
ఇప్పటి వరకు మొత్తం 19 వాయిదాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు 20వ విడత డబ్బుల కోసం లబ్ధిదారులైన రైతులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ 20వ విడత డబ్బులు రిలీజ్‌కు సంబంధించిన తేదీని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఆగస్టు 2న అంటే ఇవాళ ఈ డబ్బులు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి నుంచి ఈ నిధులను రిలీజ్ చేస్తారు. ఇందులో 9.7 కోట్ల మంది రైతులకు రూ. 2,000 చొప్పున బ్యాంకు అకౌంట్‌లో జమ చేయనున్నారు.
అయితే దీని కంటే ముందు రైతులు కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల కుటుంబాలకు అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం అందాలంటే రైతులు తప్పనిసరిగా.. e-KYC పూర్తి చేసి, భూమి రికార్డుల ధృవీకరణను కలిగి ఉండాలి. ఈ ప్రక్రియలను పూర్తి చేయని రైతులు 20వ విడత డబ్బులు పొందలేరు. ఇప్పటికీ చాలా మంది రైతులు ఇంకా e-KYC పూర్తి చేయించుకోలేదు. అందువల్ల రేపు రిలీజ్ కానున్న నిధులు రైతుల అకౌంట్లోకి నేరుగా పడాలంటే త్వరగా e-KYC పూర్తి చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
Also Read:విజయ్ ‘కింగ్డమ్’ మూవీపై రష్మిక రివ్యూ.. ఒక్కమాటతో తేల్చేసిందిగా..
e-KYC ఎలా పూర్తి చేయాలి?
e-KYC పూర్తి చేయడానికి ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
అక్కడ e-KYC ఎంపికపై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
దీని తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
అది ఎంటర్ చేసి చెక్ చేసుకోవాలి.
అందులో మొబైల్ నంబర్ ఆధార్ కార్డుకు లింక్ లేకపోయినా.. లేదా ఓటీపీ రాకపోయినా.. దగ్గర్లో ఉన్న CSC కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్స్ ద్వారా E-KYC పూర్తి చేసుకోవచ్చు.