Rahul Gandhi: 'మోదీ దమ్ముంటే సిందూర్‌ సీక్రెట్ చెప్పు'.. రాహుల్ గాంధీ సవాల్

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆపరేషన్ సిందూర్‌ విషయంలో కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సైనికుల చేతులను మోదీ ప్రభుత్వం కట్టేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వంమే పాకిస్థాన్‌కు లొంగిపోయిందని విమర్శలు చేశారు.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

ప్రస్తుతం వర్షకాల పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ అంశాల గురించి చర్చించాలని విపక్షాలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దీనిపై వివరణ ఇచ్చారు. అయితే మంగళవారం కూడా ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరిగింది. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ ఈ అంశంలో  కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించారు. 

Also Read: భయపెడుతున్న ఐటీ ఉద్యోగాలు.. లక్షలాది మందిని తొలగిస్తున్న బడా కంపెనీలు

Rahul Gandhi Comments On Operation Sindoor

'' పహల్గాం ఉగ్రదాడి అత్యంత అమానుష ఘటన. అక్కడ పర్యాటకులను దారుణంగా చంపారు. భార్యలు చూస్తుండగానే భర్తలను కాల్చేశారు. ఈ ఉగ్రదాడిని ప్రతిఒక్కరూ కూడా ఖండించారు. భారత ఆర్మీ, శక్తి సామర్థ్యాలపై నాకు ఎలాంటి అనుమానాలు లేవు. ఇండియన్ ఆర్మీకి నా సెల్యూట్.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలి. భారత సైనికులకు పూర్తిగా స్వేచ్ఛనివ్వాలి. సైనిక చర్య చేపట్టేందుకు     దృఢ సంకల్పం కావాలి. గతంలో ఇందిరా గాంధీ సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. 1971 ఇండియా-పాక్ యుద్ధంలో లక్షలాది మంది పాకిస్థాన్ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. 

ఈ ప్రభుత్వానికి మాత్రం రాజకీయ సంకల్పం లేదు. ఆపరేషన్ సిందూర్‌ను ఆకస్మాత్తుగా ఆపేశారు. సైనికుల చేతులను మోదీ ప్రభుత్వం కట్టేసింది. ఈ ప్రభుత్వం పాకిస్థాన్‌కు లొంగిపోయింది. కాల్పుల విరమణ అమలు చేద్దామని మోదీ ప్రభుత్వమే పాకిస్థాన్‌ను అడిగింది. అర్ధరాత్రి కాల్పుల విరమణ ప్రస్తావన వచ్చింది. కేవలం 30 నిమిషాల్లోనే మోదీ ప్రభుత్వం లొంగిపోయింది. భారత సైన్యానిది ఎలాంటి తప్పు లేదు. కేంద్ర ప్రభుత్వమే తప్పు చేసింది. తానే యుద్ధం ఆపానని డొనాల్డ్ ట్రంప్ 29 సార్లు ప్రకటించారు.

Also Read :  టెర్రరిస్టుల దగ్గర పాకిస్తాన్‌ చాకెట్లు.. పార్లమెంట్‌లో అమిత్ షా కీలక విషయాలు

ఇందిరాగాంధీ ప్రదర్శించిన ధైర్యసాహసాల్లో మోదీ 50 శాతం కూడా చూపించలేకపోయారు. పైలెట్లను యుద్ధానికి పంపి వారి చేతులు కట్టేశారు. అందుకే విమానాలు కూలాయి. కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ అబద్ధం చెబుతున్నారని మోదీ ఎందుకు చెప్పడం లేదు. జైశంకర్ విదేశాంగ విధానం  ఫెయిల్‌ అయ్యింది. పహల్గాం ఉగ్రదాడి సూత్రదారి పాక్ ఆర్మీ చీఫ్ అసీఫ్ మునీర్. అతడితో ట్రంప్ లంచ్ చేస్తే మోదీ ఎందుకు ఖండించలేదు ?.  భారత విదేశాంగ విధానం ముందు పెద్ద సవాల్ ఉంది. పాకిస్థాన్, చైనా కలిసి అన్ని విధాలుగా దాడి చేశాయి. శాటిలైట్‌ సమాచారాన్ని చైనా పాకిస్థాన్‌కు అందించింది. పాకిస్థాన్, చైనా విషయంలో మేము హెచ్చరిస్తే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దేశం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని'' రాహుల్ గాంధీ అన్నారు. అనంతరం ప్రధాని మోదీ కూడా ఈ అంశం గురించి రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితిలో 193 దేశాలుంటే కేవలం మూడు దేశాలు మాత్రమే ఆపరేషన్ సిందూర్‌ను ఖండించాయని అన్నారు. కాల్పుల విరమణలో విదేశీ జోక్యం లేదని స్పష్టం చేశారు.  

telugu-news | rtv-news | pm modi | national news in Telugu | latest-telugu-news

Advertisment
తాజా కథనాలు