Operation Mahadev: టెర్రరిస్టుల దగ్గర పాకిస్తాన్‌ చాకెట్లు.. పార్లమెంట్‌లో అమిత్ షా కీలక విషయాలు

ఆపరేషన్ మహదేవ్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన టెర్రరిస్టుల దగ్గర పాకిస్తాన్‌లో తయారైన చాకెట్లు దొరికాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారు పహల్గామ్ దాడికి పాల్పడిన పాకిస్తానీలు అని రుజువు ఏంటని ప్రతిపక్ష నేత చిదంబరం అడిగారు.

New Update
Amit Shah

Amit Shah

జమ్ముకశ్మీర్‌లో ఆపరేషన్ మహదేవ్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన టెర్రరిస్టుల దగ్గర పాకిస్తాన్‌లో తయారైన చాకెట్లు దొరికాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉగ్రవాదుల పాక్ ఓటర్ వివరాలు కూడా ఉన్నాయని పార్లమెంట్‌లో చెప్పారు. ముగ్గురు ఉగ్రవాదులు కచ్చితంగా పాకిస్తాన్‌కు చెందిన వారే అని అమిత్ షా స్పష్టం చేశారు.

ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారు పహల్గామ్ దాడికి పాల్పడిన వారుని, పాకిస్తాన్‌కు చెందిన వారే అని ఆధారాలు ఏంటని ప్రతిపక్ష నేత చిదంబరం ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చిదంబరం ప్రశ్నకు పార్లమెంట్‌లో అమిత్ షా సమాధానం ఇచ్చారు. చిదంబరం పాకిస్తాన్‌కు ఎందుకు క్లీన్‌చిట్ ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆయన ఉగ్రవాదుల గురించి ఆధారాలు అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్‌ను రక్షిస్తే చిదంబరానికి ఏం వస్తుందన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్న టెర్రరిస్టులను మట్టుబెడితే విపక్షాలు సంతోషిస్తాయని అనుకున్నా.. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు టెర్రరిస్టులు చనిపోయినందుకు బాధపడుతున్నాయని కేంద్రమంత్రి మండిపడ్డారు. 

ఇండియన్ ఆర్మీ చేతిలో హతమైన ఉగ్రవాదుల గురించి పాకిస్తాన్ ఓటర్ వివరాలు ఉన్నాయని అమిత్ షా తెలిపారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి గురించి ఆయన వివరించారు. దానిక ప్రతీకారంగానే ఇండియన్ ఆర్మీ మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్‌లో 125 మంది ఉగ్రవాదుల కంటే ఎక్కవే హతమార్చామని చెప్పుకొచ్చారు. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలపై దాడుల చేశామన్నారు. ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదని, మోదీ సర్కార్ అని ఆయన ఎద్దేవా చేశారు.

పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రదాడిపై సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా విపక్షాలపై ఫుల్ ఫైర్ అయ్యారు. పాకిస్తాన్, ఉగ్రవాదులకు ప్రతిపక్షాలకు మద్దతుగా మాట్లాడుతున్నాయని ఆయన మండిపడ్డారు.

మే 9న పాకిస్థాన్‌పై దాడి కోసం ఆర్మీకి ఆదేశాలు ఇచ్చిన‌ట్లు మంత్రి షా చెప్పారు. 11 ఎయిర్‌బేస్‌ల‌ను ధ్వంసం చేశామ‌న్నారు. నూర్ ఖాన్ ఛ‌క్లా, మురిద్‌, సుగుర్దా, ర‌ఫికీ, ర‌హిమ్ ఖాన్‌, జాకోబాబాద్‌, భోలారిని ధ్వంసం చేసిన‌ట్లు చెప్పారు. 6 రేడార్ల‌ను, స‌ర్ఫేస్ టు ఎయిర్ ఆయుధాల‌ను ధ్వంసం చేశామ‌న్నారు. ఎయిర్ బేస్‌ల‌ను టార్గెట్ చేయ‌లేద‌ని, కానీ భార‌త్‌లో ఉన్న పౌర ప్రాంతాల‌ను పాకిస్థాన్ అటాక్ చేసే ప్ర‌య‌త్నం చేసింద‌న్నారు. పాకిస్థాన్ దాడుల్లో అన్ని ర‌కాల సామ‌ర్థ్యాల‌ను కోల్పోవ‌డంతో, మ‌రో అవ‌కాశం లేక పాకిస్థాన్ లొంగిపోయిన‌ట్లు అమిత్ షా తెలిపారు. 1951, 1971లో జ‌రిగిన యుద్ధాల గురించి ఆయ‌న పార్లమెంట్‌లో వెల్ల‌డించారు. పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ను నెహ్రూ అప్ప‌గించార‌ని, షిమ్లా ఒప్పందంలో దాన్ని డిమాండ్ చేయ‌లేదన్నారు.

Advertisment
తాజా కథనాలు