/rtv/media/media_files/2025/07/24/ghaziabad-2025-07-24-09-36-50.jpg)
fake ambassador harshvardhan
నకిలీ అధికారులు, ఆఫీసులు, డాక్టర్లు, పోలీస్ స్టేషన్ లూ అన్నీ చూశాం. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తి ఏకంగా నకిలీ రాయబారి కార్యాలయాన్నే సృష్టేచేశాడు. దాని కోసం ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని ఎప్పుడూ వినని, అసలు ఉనికిలోనే లేని దేశాలను సృష్టించాడు. వెస్ట్ ఆర్కిటికాతో పాటు సబోర్గా, పౌల్వియా, లొడోనియా లాంటి దేశాలకు తాను రాయబారినంటూ హర్షవర్ధన్ ప్రచారం చేసుకున్నాడు. అంతేకాదు దౌత్యపరమైన నంబర్ ప్లేట్లను కూడా తయారు చేసుకున్నాడు. నాలుగు కార్లను ఎప్పుడూ బిల్డింగ్ ముందు ఉండేలా చూసుకున్నాడు.
అంతే దాని తరువాత నుంచి అమాయకులైన కుర్రాళ్ళను వల్లో వేయడం మొదలెట్టాడు. విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని..షెల్ లాంటి కంపెనీలతో లావాదేవీలు కూడా చేశాడు. 2011లో అక్రమంగా శాటిలైట్ ఫోన్‌ను వినియోగించాడు. దీని కోసం తన పేరును HE HV జైన్ గా మార్చుకున్నాడు. హిస్ ఎక్సలెన్సీగా చలామణి అవుతూ అందరినీ మోసం చేశాడు హర్షవర్ధన్. దీనికోసం హర్షవర్ధన్ జైన్ ఘాజియాబాద్‌లోని ఐటీఎస్ కళాశాల నుంచి.. లండన్ కాలేజీ ఆఫ్ అప్లైడ్ సైన్‌లోనూ ఉన్నత విద్యను అభ్యసించి ఎంబీఏ పట్టాలు పొందాడు.
ఈజీ మనీకు అలవాటు పడి..
అయితే ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సడెన్ అటాక్ తో మొత్తం విషయాలను బయటపడ్డాయి. నకిలీ రాయబారిగా చెలామణి అవుతున్న హర్షవర్ధన్ ను అరెస్ట్ చేశారు. అతని దగ్గర ఉన్న వెస్టార్కిటికా, సెబోర్గా, పౌల్బియా, లండనియా వంటి సూక్ష్మ దేశాలకు చెందిన దౌత్య పాస్‌పోర్టులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే నిజానికి హర్షవర్ధన్ జైన్ ఒకప్పుడు బాగా బతికి కుటుంబం. రాజస్థాన్ లో విలాసవంతమైన జీవితం జీవించాడు. వారికి పాలరాయి వ్యాపారం ఉండేది. కానీ ఒక్కసారిగా నష్టాలు వచ్చి మొత్తం పరిస్థితి తారుమారు అయిపోయింది. దీని తరువాత ఆధ్యాత్మిక గురువు చంద్రస్వామి, ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గి తో కలిసి లండన్, దుబాయ్ ల్లో వ్యాపారలు చేశాడు. ఈ క్రమంలో లెక్కల్లో లేని నగదు దాచి పెట్టడం.. మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడు. అయితే చంద్రస్వామి మరణం తర్వాత హర్షవర్ధన్ ను మళ్ళీ ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అప్పటికే ఈజీ మనీకు అలవాటు పడ్డ హర్షవర్ధన్..ఘజియాబాద్‌లో నకిలీ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించి.. లేని దేశాలను సృష్టించి.. ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడ్డాడు.
Also Read: Bangladesh: ఎయిర్ క్రాష్ బాధితుల కోసం ముందుకు వచ్చిన భారత్..ఢాకాకు స్పెషల్ టీమ్