Harihara Veeramallu: పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'హరిహర వీరమల్లు' ఈరోజు థియేటర్స్ లో విడుదలైంది. 16వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యంలోని పరిస్థితులకు అద్దం పడుతూ ఈ సినిమాను తెరకెక్కించారు. పవన్ స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో మచిలీపట్నం పోర్ట్ ఫైట్, చార్మినార్ చేజ్, కుస్తీ ఫైట్ పవన్ ఫ్యాన్స్ లో జోష్ నింపాయి. పోర్ట్ సీక్వెన్స్ లో పవన్ ఎలివేషన్స్ అలరించాయి. ఇక పవన్ ఎంట్రీ సీన్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించింది. మొత్తానికి పవన్ ఎంట్రీ, పలు యాక్షన్ బ్లాక్స్, కొల్లగొట్టినాదిరో పాటతో ఫస్ట్ ఆఫ్ అంచనాలకు దీటుగా సాగింది.
సెకండ్ ఆఫ్..
ఇంటర్వెల్ కి ముందు కుతుబ్ షాహీ కోటలోని కొన్ని సీన్స్ బాగా అలరించాయి. దీంతో సెకండాఫ్ పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. కానీ ఆ తర్వాత అంచనాలకు తగ్గట్టుగా కథ, కథనాలు లేకపోవడం, సీన్స్ ని కాస్త ల్యాగ్ చేశారు అన్నట్లుగా అనిపించింది. ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ సీన్ తో మళ్ళీ ఉపందుకుంటుంది. మొఘల్ పాలనలో ఉన్న గ్రామంలో జరిగే యాక్షన్ బ్లాక్ అలరించింది. అలాగే పవన్ స్వయంగా డిజైన్ చేసిన క్లైమాక్స్ ఫైట్ కూడా ఆకట్టుకుంది. అలాగే సనాతన ధర్మం ఇతివృత్తాన్ని హైలైట్ చేశారు.
నటీనటుల పర్ఫార్మెన్స్
హరిహర వీరమల్లు పవన్ తొలి పీరియాడిక్ డ్రామా ఇది. ఇప్పటివరకు ట్రెండీగా సాగే కథల్లో ఒక చిల్, స్టైలిష్ హీరో పాత్రలో కనిపించిన పవన్.. ఇప్పుడు వాటికి బిన్నంగా ఒక చారిత్రాత్మక యోధుడిగా ఆకట్టుకున్నారు. వీరమల్లు పాత్రలో ఒదిగిపోయారు. ఆయన హీరోయిజం, స్క్రీన్ ప్రజెన్స్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ సినిమాకి ప్రాణం పోశాయి. ఆ తర్వాత బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో ఆకట్టుకున్నారు. సెకండ్ ఆఫ్ కంటే ఫస్ట్ హాఫ్ లో ఆయన పాత్రను బలంగా చిత్రీకరించారు. ఇక పంచమి పాత్రలో నిధి అగర్వాల్ ఆకట్టుకుంది. ఆమె జ్యూవెలరీ, కాస్ట్యూమ్స్ ప్రతేకంగా నిలిచాయి. మరీ ముఖ్యంగా కొల్లగొట్టినాదిరో, తార తార పాటల్లో మరింత అందంగా కనిపించింది.
ఎం.ఎం. కీరవాణి సంగీతం
ఆస్కార్ విజేత మరోసారి తన నైపుణ్యాన్ని నిరూపించారు. ఆయన నేపథ్య సంగీతం కీలక సన్నివేశాలకు ప్రాణం పోసింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, అత్యంత భావోద్వేగ నాటకీయత బీజేఎంతో ఆకట్టుకున్నాయి.
St : #HariHaraVeeraMallu
— Nikhil KS 🩷 (@NikhilKalyan88) July 24, 2025
Story line👌@PawanKalyan 💥🔥 @AgerwalNidhhi ❤️PK title card ❤️🔥PK Entry👌💥Songs👍 BGM'S & Asura hanaman 🥁 🔥Kusti fight 💥Interval❤️🔥1st half 👌❤️VFX'S & CGI👎2nd half🥲Pre climax fight 💥Climax👍Emotions👎 Finally it's an Average film IMO 2.5/5 🍿 pic.twitter.com/EjtrhF7eng
సినిమా బలలు
- పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్
- కీరవాణి మ్యూజిక్
- ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్
- యాక్షన్ సన్నివేశాలు
బలహీనత
- నాసిరకం VFX
- సెకండ్ ఆఫ్
Also Read: Hari Hara Veeramallu: 'హరిహర వీరమల్లు' అరాచకం.. హైలైట్ సీన్స్ ఇవే!