Rahul Gandhi: RSS చీఫ్‌ మోహన్‌ భాగవత్‌పై రాహల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల ఆర్ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్ దేశ స్వాతంత్ర్యం విషయంలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ స్పందించారు.ఆయన చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Mohan Bhagwat and Rahul Gandhi

Mohan Bhagwat and Rahul Gandhi

ఇటీవల ఆర్ఎస్‌ఎస్‌ (RSS) చీఫ్‌ మోహన్‌ భాగవత్ దేశ స్వాతంత్ర్యం విషయంలో చేసిన వ్యాఖ్యలపై విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. ఆయన చేసిన వ్యా్ఖ్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్‌ రాజధాని పట్నాలో జరిగిన సంవిధన్ సురక్ష సమ్మేళన్ కార్యక్రమంలో రాహుల్‌గాంధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ '' బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ రాజ్యాంగాన్ని రూపుమాపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అణగారిన వర్గాల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నాయి.  

Also Read :  Mohammed Siraj: పాపం సిరాజ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో దక్కని చోటు

మైనార్టీలు, దళితులు రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ వాళ్లకు ఎలాంటి అధికారాలు ఉండటం లేదు. ఆర్ఎస్‌ఎస్‌తో పాటు మరికొన్ని సంస్థలు దేశాన్ని నడుపుతున్నాయి. దేశ సంపద అనేది కేవలం కొంతమంది పారిశ్రామికవేత్తల చేతుల్లోనే ఉండిపోయింది. భారత రాజ్యాందం ఒక పుస్తకం మాత్రమే కాదు. దళితులు ఎదుర్కొన్న అన్యాయాల గురించి మాట్లాడుతుంది. దేశంలో కులగణన జరగడం కచ్చితంగా అవసరం. దేశ అభివృద్ధిలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని'' రాహుల్ గాంధీ అన్నారు.  

Also Read :  డెలివరీ తర్వాత ఆడవారి ప్రైవేట్ భాగంలో ఆవిరి పట్టడం కరెక్టేనా?

Rahul Gandhi Alleges BJP - RSS

అయితే ఇటీవల ఆర్ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్ భాగవత్‌ (Mohan Bhagwat) మాట్లాడుతూ'' అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన జరిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది. శత్రువులతో భారత్ ఎన్నో శతాబ్దాల నుంచి పోరాడింది. రామ మందిర ఉద్యమం ఎవరినీ వ్యతిరేకించడానికి జరగలేదు. దేశం తనను తాను మేలుకోల్పడానికే చేసింది.  రామమంది ప్రతిష్ఠాపన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేవని'' మోహన్ భాగవత్ అన్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్‌ గాంధీ.. మోహన్ భాగవత్ రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడారంటూ విమర్శలు చేశారు. 

Also Read: మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారం చేసింది అతడే.. కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు!

Also Read :  కాపురం ఖరీదు రూ. కోటి.. డిమాండ్ చేసిన భార్య

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు