/rtv/media/media_files/2025/01/18/Va24JD5S7zWMALk3U2C4.jpg)
vaginal steaming
Vaginal Steaming: డెలివరీ తరవాత ఆడవారి యోని భాగానికి ఆవిరి పట్టే ధోరణి అమ్మమ్మల కాలం నాటి నుంచే ఉంది. ఆవిరి పట్టడం ద్వారా ఒళ్ళు నొప్పులు తగ్గి, గర్భాశయం కూడా శుభ్రపడుతుందని నమ్ముతారు. అయితే దీనికి సంబంధించి శాస్త్రీయంగా ఎలాంటి రుజువు లేదు. ప్రస్తుతం విదేశాల్లో బాగా ప్రసిద్ధి ఈ వెజినల్ స్టీమింగ్ మహిళలకు ఎంత వరకు సురక్షితమైనది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: Kareena Kapoor: సైఫ్ అలీఖాన్ దాడిపై భార్య కరీనా మరో కీలక పోస్ట్.. అసలేం జరిగిందంటే!
వెజినల్ స్టీమింగ్ అంటే ఏమిటి
వెజినల్ స్టీమింగ్ అనేది సన్నిహిత ప్రాంతానికి ఆవిరిని వర్తింపజేసే ప్రక్రియ. కొన్ని ప్రత్యేకమైన మూలికలను నీటిలో కలిపి ఆవిరిని పడతారు. దీనినే వెజినల్ స్టీమింగ్ అంటారు. ప్రైవేట్ భాగంలో ప్రత్యేకమైన మూలికలతో కూడిన ఆవిరిని పట్టడం ద్వారా పీరియడ్స్ క్రాంప్స్ తగ్గుతాయని చెబుతారు. అంతేకాదు ఇది సన్నిహిత ప్రాంతాన్ని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్, పైల్స్, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను తొలగించడంలో తోడ్పడుతుందని చెబుతారు.
వెజినల్ స్టీమింగ్ ఎలా చేస్తారు..
వెజినల్ స్టీమింగ్ కోసం ముందు వేప, చమోమిలే, కలేన్ద్యులా, తులసి , ఒరేగానో వంటి ప్రత్యేకమైన మూలికలను నీటిలో వేసి మరిగిస్తారు. ఆ తర్వాత ఆ ఆవిరిని ప్రైవేట్ భాగానికి పట్టిస్తారు. స్పాలు మొదలైన ప్రదేశాల్లో స్టీమింగ్ కోసం ప్రత్యేక రకం కుర్చీని సిద్ధం చేస్తారు.
సైడ్ ఎఫెక్ట్స్
అయితే దీని వల్ల ప్రయోజనాలతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆవిరి తేమ కారణంగా సన్నిహిత ప్రాంతంలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. రోజూ ఆవిరి తీసుకోవడం హానికరం. కొన్ని రకాల మూలికల వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియను చేసే ముందు వైద్యులను సంప్రదించాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read : వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్