/rtv/media/media_files/2024/11/16/tI7EFx3h39mMg5AVYINS.jpg)
uttar pradesh
భార్యతో కాపురం చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని భర్తను డిమాండ్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్‌కి చెందిన ఓ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దీంతో భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త తనతో కలిసి జీవించాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆ భర్త పోలీసులను ఆశ్రయించాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత భార్య పూర్తిగా మారిపోయిందని పోలీసులకు తెలిపాడు.
ఇది కూడా చూడండి: budget 2025-26 బడ్జెట్‌లో మిడిల్ క్లాస్‌కు గుడ్‌న్యూస్..!
ప్రభుత్వ ఉద్యోగం రావడంతో..
వీరిద్దరికి 2020లో వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత ఇద్దరూ కాన్పూర్‌లోనే ఉంటున్నారు. అయితే భార్యకు ఢిల్లీలో ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం రావడంతో అంతా మారిపోయింది. ఆమెతో పాటు వారి తండ్రి, అన్నదమ్ములిద్దరూ కూడా తనను బెదిరిస్తున్నారని ఆ భర్త పోలీసులకు తెలిపాడు. లేకపోతే వరకట్నం కేసు వేస్తానని భార్య బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: America: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!
ఇదిలా ఉండగా.. ఇటీవల ఉత్తరప్రదేశ్ మొరదాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సమీర్ అనే వ్యక్తి భార్య వేరే వ్యక్తితో కారులో ఉండటాన్ని గమినించాడు. దీంతో తన బైక్‌తో కారును అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆ కారు నడిపిన హసన్ ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. సమీర్ బానెట్‌పై ఉండగానే హైస్పీడ్‌తో కిలోమీటర్ల మేర వరకు డ్రైవ్ చేశాడు. దీంతో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. సమీర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. హసన్‌ను అరెస్టు చేసి కారును పోలీసులు సీజ్ చేశారు.
ఇది కూడా చూడండి: Urvashi Rautela: సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్
ఇది కూడా చూడండి: Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు