/rtv/media/media_files/2025/10/01/us-enters-day-1-of-shutdown-as-republicans-and-democrats-remain-far-apart-on-deal-2025-10-01-18-43-10.jpg)
US enters day 1 of shutdown as Republicans and Democrats remain far apart on deal
అమెరికాలో షట్‌డౌన్ ప్రారంభమయ్యింది. రెండు నిధుల బిల్లులకు సంబంధించి సెనెట్ ఆమోదం తెలపకపోవడంతో ఈ పరిస్థితులు ఎదురయ్యాయి. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 9.30కి ఈ ప్రక్రియ మొదలైంది. అసలు షట్‌డౌన్ అంటే ఏంటి ? ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి ? దీనివల్ల మన భారత్‌పై కూడా ప్రభావం పడుతుందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: POKలో 8 మంది పాక్ పౌరులు మృతి.. బరితెగించిన పాకిస్తాన్ ఆర్మీ
షట్‌డౌన్ అంటే
అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేందుకు నిధులు అందించే బిల్లులను అక్కడి కాంగ్రెస్‌లో ఆమోదిస్తారు. అయితే గడవులోగా ఈ బిల్లులు ఆమోదం పొందడంలో విఫలమైనప్పుడు లేదా అధ్యక్షుడు సంతకం చేసేందుకు నిరాకరించినప్పుడు ఈ షట్‌డౌన్ ప్రక్రియ మొదలవుతుంది. అమెరికాలో ప్రధాన పార్టీలైన రిపబ్లికన్స్-డెమోక్రాట్స్ మధ్య వివాదం తలెత్తినప్పుడు ఇలాంటి సమస్య ఏర్పడుతుంది. అమెరికా ప్రభుత్వానికి నిధులు లభించకపోవడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు షట్‌డౌన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈసారి తమ డిమాండ్లు నెరవేర్చని రిపబ్లికన్ స్టాపేజ్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ షట్‌డౌన్ మొదలైంది. ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఇలా జరిగింది.
Also Read: గాజాలో దారుణ పరిస్థితులు.. ఆహారం కావాలంటే మహిళలు కొరిక తీర్చాల్సిందే
షట్‌డౌన్ వల్ల అమెరికాలో అత్యవసరం రానీ సేవలన్నీ నిలిచిపోతాయి. దీనివల్ల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలపై ఎఫెక్ట్ పడుతుంది. దాదాపు 7,50,000 మందిని వారు పనిచేసే ప్రదేశంలో రిపోర్టు చేయవద్దని చెబుతారు. అయితే మిలటరీ, ఆస్పత్రులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి అత్యవసర విభాగాల్లో మాత్రం సేవలు కొనసాగుతున్నాయి. అయితే వీళ్లకు సెలవుల్లో కూడా పని చేయించుకొని వేతనాలు ఇవ్వరు. షట్‌డౌన్ ముగిసిన తర్వాతే వేతనాల చెల్లింపులు ఉంటాయి.
భారత్‌పై ప్రభావం ?
అమెరికాలో ప్రారంభమయ్యే షట్‌డౌన్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం ఉంటుంది. దీనివల్ల భారత్‌పై కూడా ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా భారత్ స్టాక్ మార్కెట్ల నుంచి అమెరికాకి చెందిన పెట్టుబడిదారులు డబ్బులు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల భారత్‌లో స్టాక్ మార్కెట్లు కాస్త బలహీనపడొచ్చు. అంతేకాదు ఐటీ సర్వీసులపై కూడా ఈ ప్రభావం పడనుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: సొంత ప్రజల పైనే డ్రోన్లతో దాడులు చేస్తున్న పాకిస్థాన్.. భయంతో వణికిపోతున్న ప్రజలు