Fire Accident: ఎన్నికల సంబరాల్లో అగ్నిప్రమాదం.. 16 మందికి గాయాలు

ఎన్నికల విజయోత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. గెలుపు సంబరాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత సంబరాలు మిన్నంటాయి. అయితే, పుణె జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జేజూరీలో ఈ సంబరాలు విషాదాన్ని నింపాయి.

New Update
MH insident

ఎన్నికల విజయోత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. గెలుపు సంబరాల్లో(local body poll victory celebration) అగ్నిప్రమాదం(fire accident) సంభవించింది. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత సంబరాలు మిన్నంటాయి. అయితే, పుణె జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జేజూరీలో ఈ సంబరాలు విషాదాన్ని నింపాయి. జేజూరీ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇద్దరు మహిళా కౌన్సిలర్లు సహా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. - Viral Video

ఆదివారం (డిసెంబర్ 21) జేజూరీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో NCP అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. విజయాన్ని పురస్కరించుకుని నూతన కౌన్సిలర్లు, కార్యకర్తలు కలిసి జేజూరీ గఢ్ (ఖండోబా ఆలయం) మెట్ల వద్ద మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లారు. అక్కడ సాంప్రదాయబద్ధంగా 'భండారా' (పసుపు పొడి) చల్లుతూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. - viral news telugu

Also Read :  బంగ్లా‌దేశ్‌లో చావులకు పాక్ కారణమా.. 2026 ఫిబ్రవరి టార్గెట్‌గా కుట్ర ఇదే!

ప్రమాదంపై పోలీసుల అనుమానాలు..

కలర్ స్ప్రేలు: యువకులు ఉత్సాహంతో పిచికారీ చేసిన 'కలర్ స్ప్రే'లలోని గ్యాస్, అక్కడ వెలుగుతున్న దీపాలకు తగలడం వల్ల మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి.
కల్తీ భండారా:భండారాలో మండే స్వభావం ఉన్న రసాయనాలు కలిసి ఉండటం వల్ల, అది హారతి కర్పూరం లేదా దీపపు జ్వాలల మీద పడటంతో అగ్నిప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని, వెంటనే దట్టమైన పొగ కమ్మేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
 
ఈ ప్రమాదంలో జేజూరీ మున్సిపల్ కౌన్సిల్‌కు కొత్తగా ఎన్నికైన స్వరూప ఖోమ్నే, మోనికా ఘాడగే అనే ఇద్దరు కౌన్సిలర్లు గాయపడ్డారు. వీరితో పాటు మరో 14 మంది కార్యకర్తలకు కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే జేజూరీలోని స్థానిక ఆసుపత్రులకు, పరిస్థితి విషమంగా ఉన్న వారిని పుణెలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం అందరూ చికిత్స పొందుతున్నారని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. బారామతి ఎంపీ సుప్రియా సూలే ఈ ఘటనపై స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ భండారా వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేజూరీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మండే స్వభావం ఉన్న స్ప్రేలు, రసాయనాల వినియోగంపై నిషేధం విధించే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు.

Also Read :  ఉపా కేసుపై మజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్టు.. అసలేంటి ఈ చట్టం ?

Advertisment
తాజా కథనాలు