Bangladesh: బంగ్లా‌దేశ్‌లో చావులకు పాక్ కారణమా.. 2026 ఫిబ్రవరి టార్గెట్‌గా కుట్ర ఇదే!

భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న బంగ్లాదేశ్‌ను దూరం చేయాలనే కుట్ర జరుగుతోంది. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ మరణంతో బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది. 2026 ఫిబ్రవరిలో జరగనున్న బంగ్లాదేశ్‌ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి.

New Update
Bangladesh haseena

దశాబ్ధాల కాలం నుంచి భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న బంగ్లాదేశ్‌(bangladesh-crisis) ను దూరం చేయాలనే ఓ కుట్ర జరుగుతోంది. ఆ కుట్రలో భాగంగానే బంగ్లాదేశ్, భారత్ మధ్య విభేదాలు తీసుకురావడానికి ఓ శక్తి పని చేస్తోంది. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ(Sharif Osman Hadi) మరణం తర్వాత బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది. ఈ హత్య వెనుక కుట్ర ఉందని, నిందితులు భారత్‌కు పారిపోయారని ఆరోపిస్తూ నిరసనకారులు భారత రాయబార కార్యాలయాల వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. చిట్టగాంగ్‌లోని భారత డిప్యూటీ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వాస్తవానికి 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసమే టార్గెట్‌గానే అక్కడ రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి.

ప్రస్తుతానికి రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది, ముఖ్యంగా పాత సంప్రదాయ పార్టీలకు (బంగ్లాదేశ్ నేషనలిస్ట్, జమాతే ఇస్లామీ), కొత్తగా వస్తున్న విద్యార్థి శక్తులకు (NCP) మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఏర్పడిన అస్థిరతను అదునుగా తీసుకుని, కొందరు దుండగులు బెంగాలీ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఢాకాలోని చారిత్రక సాంస్కృతిక సంస్థ 'ఛాయానాట్'పై జరిగిన దాడి ఈ ఆందోళనకు ప్రధాన కారణంగా మారింది. 

Also Read :  Election Commission: తెలంగాణలో SIR.. ఎలా చేస్తారో తెలుసా ?

బంగ్లాదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీలు

2024 ఆగస్టులో చోటుచేసుకున్న విద్యార్థి తిరుగుబాటులో షేక్ హసీనా ప్రభుత్వం పతనమై బంగ్లాదేశ్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం దేశంలో ప్రధానంగా వినిపిస్తున్న రాజకీయ పార్టీలు
1. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ:ప్రస్తుతం దేశంలో అత్యంత బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ఈ పార్టీ, రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
2.బంగ్లాదేశ్ అవామీ లీగ్: షేక్ హసీనా(sheik-hasina) నేతృత్వంలోని ఈ పార్టీ గత 15 ఏళ్లుగా అధికారంలో ఉంది. అయితే, ఆగస్టు పరిణామాల తర్వాత ఈ పార్టీ నాయకులు దేశం విడిచి వెళ్లడం లేదా అరెస్టవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ పార్టీ కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంపై అనిశ్చితి నెలకొంది. - Bangladesh elections
3.బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ: గతంలో నిషేధానికి గురైన ఈ మతతత్వ పార్టీ, ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం హయాంలో మళ్లీ పుంజుకుంది. యువత, గ్రామీణ ప్రాంతాల్లో దీనికి మద్దతు పెరుగుతోంది. - Bangladesh High Tension

స్టూడెంట్స్ పెట్టిన కొత్త పార్టీలు

నేషనల్ సిటిజన్ పార్టీ:2025 ఫిబ్రవరిలో విద్యార్థి నాయకులు ఈ పార్టీని స్థాపించారు. షేక్ హసీనాను గద్దె దించిన విద్యార్థి ఉద్యమం నుండి ఇది పుట్టింది. పాత పార్టీలకు ప్రత్యామ్నాయంగా, సంస్కరణల నినాదంతో ఇది ముందుకొచ్చింది.
ఇంక్విలాబ్ మంచా: ఇది ఒక రాజకీయ వేదికగా ఉద్భవించింది. ఇటీవల హత్యకు గురైన విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ ఈ గ్రూపులో కీలక సభ్యుడు. ఇతన్నే హత్యకు గురైయ్యాడు. దీంతో బంగ్లాదేశ్‌లో మళ్లీ హంస చెలరేగింది.

పాకిస్తాన్ కుట్రలు

ఈ దాడుల వెనుక పాకిస్థాన్‌(pakistan) కు చెందిన ఐఎస్ఐ కుట్ర ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో మతతత్వ శక్తులను ప్రోత్సహించడం ద్వారా బెంగాలీ భాషా, సాంస్కృతిక వారసత్వాన్ని తుడిచిపెట్టాలని పాక్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
1971 తరహా వ్యూహం: గతంలో పాకిస్థాన్ సైన్యం బెంగాలీ మేధావులను, కళాకారులను ఏ విధంగా లక్ష్యం చేసుకుందో, ఇప్పుడు కూడా అదే తరహాలో దాడులు జరుగుతుండటం గమనార్హం.
భారత వ్యతిరేకత:ఈ దాడులు చేస్తున్న వారు భారత్-బంగ్లాదేశ్ సంబంధాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత అనుకూల పత్రికలుగా ముద్రవేసి మీడియా సంస్థలపై దాడులు చేయడం దీనికి సంకేతం.

Also Read :  ప్రయాణీకులకు బిగ్ షాక్.. ఛార్జీల మోత

ఆందోళనలో మేధావి వర్గం

సాంస్కృతిక కేంద్రాలపై దాడులు కేవలం ఆస్తుల విధ్వంసం మాత్రమే కాదని, అది బంగ్లాదేశ్ ఆత్మపై జరుగుతున్న దాడిగా మేధావులు అభివర్ణిస్తున్నారు. ఒకవేళ ఈ ధోరణి కొనసాగితే, బంగ్లాదేశ్ తన సెక్యులర్ గుర్తింపును కోల్పోయి మత ఛాందసవాదంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను అరికట్టడంలో విఫలమైతే, దేశం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలా బంగ్లాదేశ్‌ను ముస్లీం దేశంగా మార్చి భారత్‌పై దాడులు పాల్పడాలని పాక్ ప్లాన్. ఇందులో భాగంగా బంగ్లాదేశ్‌లో మతల పేరుతో అల్లర్లు సృష్టిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు