/rtv/media/media_files/2025/08/17/pm-modi-2025-08-17-19-49-06.jpg)
PM Modi
GST సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ముసాయిదాను ఇప్పటికే రాష్ట్రాలకు పంపించినట్లు పేర్కొన్నారు. దీన్ని అమలు చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. ఈ తదుపరి తరం సంస్కరణలో చేయనున్న మార్పులు పేద, మధ్యతరగతి ప్రజలతో సహా వ్యాపారులకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. GST చట్టాన్ని సరళతరం చేసి.. పన్ను రేట్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.
Also Read: సంచలన నిర్ణయం.. ఇక నుంచి వీధికుక్కలకు కూడా క్యూఆర్ కోడ్, GPS
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో రెండు హైవే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని మోదీ మాట్లాడారు. '' జీఎస్టీపై చేపట్టనున్న సంస్కరణలు పురోగతిని సూచిస్తాయి. భవిష్యత్తులో వ్యాపార కార్యకలాపాలు తేలికగా, సులభంగా మార్చాలని భావిస్తున్నాం. ఈ సంస్కరణలు అమలు చేసేందుకు నెక్ట్స్ జెన్ GSTతో రెడీ అయిపోయాం. వచ్చే దీపావళి నాటికి ఈ సంస్కరణలు రెట్టింపు బోనస్ ఇవ్వనున్నాయి. దీనికి సంబంధించిన ముసాయిదాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. అన్ని రాష్ట్రాలకు ఈ సంస్కరణలకు సహకరిస్తాయని భావిస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని'' మోదీ అన్నారు.
Also Read: పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. సైనిక పాలనలోకి పాకిస్తాన్!
ఈ సంస్కరణలకు సంబంధించి ప్రతిపాదనపై చర్చలు జరిపేందుకు వచ్చే నెలలో GST కౌన్సిల్ సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన రెండు శ్లాబుల విధానాన్ని GST మండలి ఆమోదించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు ఉన్న నాలుగు శ్లాబుల్లో 12,28 శాతం శ్లాబులు తొలగిపోనున్నాయి. దీంతో ఇది ఓ కీలక సంస్కరణగా మిగిలిపోతుందని నిపుణులు భావిస్తున్నారు. దాదాపు 6 నెలల పాటు దీనిపై చర్చలు, సమావేశాలు సాగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాతే జీఎస్‌టీ విధానం తెరపైకి వచ్చినట్లు పేర్కొన్నాయి.
Also Read: రష్యా- ఉక్రెయిన్ వార్.. ట్రంప్ పరువు తీసేసిన పుతిన్
ఇదిలాఉండగా ప్రధాని మోదీ ఆదివారం రూ.11 వేల కోట్లతో నిర్మించిన రెండు ప్రధాన హైవే ప్రాజెక్టులు ప్రారంభించారు. వీటివల్ల ఢిల్లీ, సమీప ప్రాంత ప్రజలకు ఈ రహదారులు సౌలభ్యంగా ఉంటాయని పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే గడిచిన 11 ఏళ్లలో ఢిల్లీ NCRలో ప్రయాణం సులభరమైందని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే సోనిపత్, బహదూర్‌గఢ్, గురుగ్రామ్, రోహ్‌తక్ నుంచి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వరకు ప్రయాణం సులభతరమవుతందని పేర్కొన్నారు.
Also Read: ఈ ప్రదేశాలకు వెళ్తే.. రావడం కష్టమే.. భయంతో చనిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు!