/rtv/media/media_files/2025/08/17/dogs-qr-code-2025-08-17-19-31-06.jpg)
dogs QR Code
ఢిల్లీలో వీధి కుక్కలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయని వీటిని షెల్టర్లకు పంపించాలని ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎక్కువగా ఢిల్లీలో రేబిస్ వ్యాధితో మరణాలు పెరుగుతున్నాయని సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ పలువురు వారి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అయితే కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా కుక్కల బెడద తప్పడం లేదు. దీంతో వీధి కుక్కల బెడదను ఆరికట్టేందుకు సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ఉన్న అన్ని వీధి కుక్కలకు క్యూఆర్ కోడ్, జీపీఎస్‌ను అమర్చనున్నట్లు తెలిపింది.
ఇది కూడా చూడండి: Stray Dogs: అహింసావాది గాంధీజీయే 60 కుక్కలు చంపించాడు.. 1927లో ఏం జరిగిందంటే?
VIDEO | Shimla Municipal Corporation has launched a campaign in which all stray dogs will be given QR and GPS-based collars. With the help of GPS, the Corporation will be able to monitor the changing location and behaviour of the dogs.
— Press Trust of India (@PTI_News) August 17, 2025
(Full video available on PTI Videos -… pic.twitter.com/t32QZp0eYn
నగరంలో ఉన్న అన్ని కుక్కలకు..
నగరంలో ఉన్న అన్ని కుక్కలకు మెడపై క్యూఆర్ కోడ్, జీపీఎస్ వంటి స్మార్ట్ ట్యాగ్‌లను అమర్చుతారు. దీంతో స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ సమాచార నమోదు, ఆ కుక్కల ఆరోగ్య పరిస్థితి, వయస్సు వంటి వివరాలు అందులో పెడతారు. ఈ కుక్కల క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం వల్ల అన్ని వివరాలను కూడా తెలుసుకోవచ్చు. అలాగే జీపీఎస్ ద్వారా ఆ వీధి కుక్కల లొకేషన్‌ను కూడా ఈజీగా తెలుస్తుందని సిమ్లా మున్సిపర్ కార్పోరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వీధి కుక్కల సమస్య సిమ్లాలో ఎక్కువగా మారింది. ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాల్లో కూడా కుక్కల సమస్య ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే సిమ్లా మున్సిపల్ కార్పోరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకనైనా కొంత ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మరికొందరు ఇలా క్యూఆర్ కోడ్, జీపీఎస్ పెట్టడం వల్ల కుక్కలు ఇతరులకు కాటు వేయకుండా ఎలా ఉంటాయని అంటున్నారు. ఈ స్కాన్ వల్ల కుక్కలకు స్టెరిలైజేషన్లు వేయడం వల్ల కాస్త ప్రమాదం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
#Shimla | Municipal Corporation launches unique drive to fit stray dogs with QR & GPS-enabled collars, enabling real-time monitoring of their movement and behaviour. #StrayDogs#ShimlaMC#SmartCity#AnimalWelfare#TechForGoodpic.twitter.com/fXqPp0lXDT
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) August 17, 2025
ఇది కూడా చూడండి: Stray Dogs: వీధి కుక్కల వల్ల ఇన్ని లాభాలా.. అవి లేకుంటే భయంకరమైన వ్యాధులే