/rtv/media/media_files/2025/04/29/eJmFi0ydxCn9CtVYH9rU.jpg)
PM Modi to chair second CCS meeting tomorrow
పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వరుసగా భేటీలు నిర్వహిస్తోంది. అయితే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం కానుంది. దీనికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ భేటిలో దేశ భద్రతపై ప్రధాని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఇప్పటికే ఓసారి ఈ కమిటీ భేటీ అయిన సంగతి తెలిసిందే.
Also Read: యుద్ధానికి సిద్ధం !.. 40 లక్షల రిటైర్ట్ సైనికులను పిలిస్తున్న పాక్ ఆర్మీ
ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి వెనుక కచ్చితంగా పాకిస్తాన్ సైన్యం హస్తం ఉందని తెలుస్తోంది. ఈ దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన.. హషిమ్ మూసా పాక్ సైన్యంలోని పారా కమాండో అని తమ దర్యాప్తులో తేలినట్లు భారత అధికారులు చెబుతున్నారు. అతను ఇప్పుడు ఉగ్రవాదిగా మారిపోయాడని.. ప్రస్తుతం లష్కరే తోయిబాతో కలిసి పని చేస్తున్నాడని చెప్పారు. టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ హషీమ్‌ను ప్రత్యేకంగా ఎంపిక చేసి మరీ కశ్మీర్‌లో దాడి చేసేందుకు పంపించిందని తెలిపారు.
Also Read: ఇంకా దిగజారకు.. పాక్ మాజీ కెప్టెన్‌కి ధావన్ దిమ్మతిరిగే కౌంటర్!
కాశ్మీర్ లో ఉగ్రవాదులకు అనుకూలంగా పని చేస్తున్నారన్న అనుమానంతో భారత సైన్యం అక్కడి స్థానికులను వందల మందిని అదుపులోకి తీసుకుంది. వీళ్లలో చాలా మందికి హషీమ్ మూసా తెలుసు. పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో పని చేసిన మూసా.. ఆ తర్వాత లష్కరేలోకి సహాయకారిగా వచ్చి కరడుకట్టిన ఉగ్రవాదిగా మారాడని దర్యాప్తు బృందాలోని ఓ అధికారి తెలిపారు. దీన్ని బట్టి పాక్ సైన్యానికి, ఉగ్రవాద సంస్థలకు మధ్య ఉన్న అనుబంధాన్ని అంచనా వేయొచ్చని చెప్పారు.
Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం
telugu-news | rtv-news | national-news | pm modi