Pakistan Army: యుద్ధానికి సిద్ధం !.. 40 లక్షల రిటైర్ట్‌ సైనికులను పిలిస్తున్న పాక్ ఆర్మీ

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యం నుంచి రిటైర్ట్ అయిన వాళ్లని మళ్లీ పిలుస్తోంది. 40 లక్షల మంది మాజీ సైనికులను తిరిగి సైన్యంలోకి చేర్చుకోనున్నట్లు తెలుస్తోంది.

New Update
Pakistan Army Recalls Ex Army Soldiers

Pakistan Army Recalls Ex Army Soldiers

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణమైన ఇరుదేశాల మధ్య యుద్ధం జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది. పాక్‌ కంటే భారత సైన్యమే బలంగా ఉంది. ఇప్పటికే పాకిస్థాన్‌లో 4500 సైనికులు, అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి పారిపోయారు. దీంతో పాక్ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌ ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యం నుంచి రిటైర్ట్ అయిన వాళ్లని మళ్లీ పిలుస్తోంది. దాదాపు 40 లక్షల మంది మాజీ సైనికులను తిరిగి సైన్యంలోకి చేర్చుకోనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం

మరోవైపు పాకిస్థాన్‌ సైన్యంలో చేరేందుకు కొత్తతరం యువత ఉత్సాహం, ఆసక్తి చూపడం లేదని ఆ దేశ జర్నలిస్ట్ జావేద్ చౌదరి అన్నారు. గత 10-15 ఏళ్లుగా పాకిస్థాన్‌ సైన్యం ప్రతిష్ఠ క్షీణించిందని.. అందుకే కొత్త తరం యువత ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ.. పదవీ విరమణ చేసిన సైనికులను తిరిగి సైన్యంలోకి చేర్చుకోవడం ప్రారంభించింది. ముఖ్యంగా తూర్పు సరిహద్దు సమీపంలో మోహరించేందుకు రిటైర్ట్‌ సైనికులను వెనక్కి పిలుస్తోంది. 

పాక్‌లో కొత్త సైనిక నియామకాలు జరగడం లేదు. కనీసం వాళ్లకు జీతాలు చెల్లించేందుకు కూడా ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. అందుకే రిటైర్ట్ సైనికుల వైపు మొగ్గు చూపుతోంది. మరోవైపు ఇప్పటికే పాక్‌లో 4500 మంది ఆర్మీ కమాండర్లు, సైనికులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. 

Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!

ఇదిలాఉండగా పాక్‌లో తన అధికారాన్ని బలోపేతం చేసుకునేందుకు అసిమ్ మునీర్‌ అనేక కుట్రలు పన్నుతున్నారని తెలుస్తోంది. పహల్గాం దాడి తర్వాత.. అమెరికాకు చెందిన అధికారులు కూడా మునీర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇక ఏప్రిల్‌ 22న పహల్గాంలో బైసరన్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. 

telugu-news | rtv-news | pakistan-army 

Advertisment
తాజా కథనాలు