🔴LIVE : ఎన్టీఆర్ కు బాలయ్య నివాళి || Balakrishna Pays Tribute To Senior NTR At NTR Ghat || RTV
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ 117వ ఎపిసోడ్లో ప్రముఖ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించారు. తెలుగు సినిమాను ఆయన మరో స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడంతో ప్రధానిపై విమర్శలు వస్తున్నాయి.
అక్కినేని నాగ చైతన్య రెండో వివాహానికి సిద్ధం అవుతున్నాడు. టాలీవుడ్ లో రెండో పెళ్లి చేసుకున్నవారిలో చైతన్య కంటే ముందు చాలామంది ఉన్నారు. చైతన్య తండ్రి కూడా హీరోయిన్ అమలను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో రెండవ పెళ్లి చేసుకున్నసెలెబ్రెటీలు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకోండి.
మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడు-జూ.ఎన్ఠీఆర్ నందమూరి నట వారసుడు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం. వెండితెర స్టోరీ ఇదే. కానీ, పొలిటికల్ గా కథ వేరు. ఈ రెండు కుటుంబాల రాజకీయ శత్రుత్వం ఇప్పటిది కాదు.. దశాబ్దాల చరిత్ర తెలియాలంటే ఈ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాల్సిందే.
నవరసనట సార్వభౌముడు ఎన్టీయార్ 28వ వర్ధంతి ఈరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన ఘాట్‌ను పూలమాలలతో అలంకరించారు. తెల్లవారుఝాము నుంచి ఎన్టీయార్ కుటుంబసభ్యులు ఎన్టీయార్ ఘాట్‌కు వస్తున్నారు. శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రూ.100 నాణాన్ని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్ జయంతి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం రూ.100 ముఖ విలువ కలిగిన ప్రత్యేక నాణేన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ ఈవెంట్‌కు నటుడు బాలకృష్ణ హాజరవుతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.