PM Modi: చైనాలో అడుగుపెట్టిన మోదీ.. ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి !

ప్రధాని మోదీ చైనాకు చేరుకున్నారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు (SCO) సదస్సులో పాల్గొనేందుకు తియాంజిన్‌లో అడుగుపెట్టారు. 2020లో లడఖ్‌ సరిహద్దులో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తిన తర్వాత ప్రధాని చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి.

New Update
PM Modi lands in China after gap of 7 years

PM Modi lands in China after gap of 7 years

ప్రధాని మోదీ చైనాకు చేరుకున్నారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు (SCO) సదస్సులో పాల్గొనేందుకు తియాంజిన్‌లో అడుగుపెట్టారు. 2020లో లడఖ్‌ సరిహద్దులో గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ప్రధాని చైనాకు వెళ్లడం ఇదే తొలసారి. 2018లో చివరిసారిగా ఆయన చైనాలో పర్యటించారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సుంకాలతో విరుచుకుపడుతున్నారు. భారత్‌పై ఇప్పుడు 50 శాతం టారీఫ్‌ అమలవుతోంది.

Also Read: ట్రంప్ టారిఫ్‌లు, అమెరికా వీసా ఆంక్షలు.. తిప్పికొట్టడానికి ఇండియా మాస్టర్ ప్లాన్ ఇదే!

ఇలాంటి నేపథ్యంలో మోదీ చైనాలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. జపాన్‌లో ఆయన రెండురోజులు పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డ్రాగన్ దేశానికి పయనమయ్యారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో తియాంజిన్ వేదికగా SCO సదస్సులో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇతర దేశాధినేతలు హాజరుకానున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకురావడం కోసం భారత్‌, చైనా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ అన్నారు.  

Also Read: వివాదంలో ఇరుక్కున్న మెటా.. సెలబ్రిటీల అసభ్యకరమైన ఫొటోలపై విమర్శలు

మరోవైపు జపాన్ పర్యటన గురించి మోదీ ఎక్స్‌లో పంచుకున్నారు. భారత ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చేలా ఈ పర్యటన కొనసాగిందని పేర్కొన్నారు. అయితే ఈ పర్యటన వల్ల భారత్‌-జపాన్ మధ్య దాదాపు 13 ఒప్పందాలు ఖరారయ్యాయని సమాచారం. ఇండియా రాబోయే పదేళ్లలో జపాన్ ఏకంగా రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. ముఖ్యంగా సెమీకండక్టర్లు, టెలికాం, క్లీన్ ఎనర్జీ వంటి కీల ఖనిజాలు, అలాగే రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల వంటి వ్యూహాత్మక రంగాల్లో సహకారం పెంచుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించినట్లు సమాచారం.  

Also Read: వీడో హ్యూమన్‌ జీపీఎస్‌..చొరబాట్ల దారులన్నీ వీడి మైండ్‌లోనే...

Advertisment
తాజా కథనాలు