Human GPS Bagu Khan : వీడో హ్యూమన్‌ జీపీఎస్‌..చొరబాట్ల దారులన్నీ వీడి మైండ్‌లోనే...

ఉగ్రవాదుల్లో హ్యూమన్ జీపీఎస్‌గా పిలవబడే బాగూఖాన్‌(సమందర్‌ చాచా)ను కాల్చిచంపినట్లు ఆర్మీవర్గాలు ఈ రోజు వెల్లడించాయి. తీవ్రవాదులెందరికో చొరబాటు దారులు చెప్పిన అతడు మరో ఉగ్రవాదితో కలిసి దేశంలోకి చొరబడేందుకు యత్నించగా ఎన్‌కౌంటర్ చేశామని అధికారులు తెలిపారు.

New Update
Human GPS Bagu Khan

Human GPS Bagu Khan encounter

Human GPS Bagu Khan : పాకిస్థాన్‌ తీవ్రవాదుల్లో చాలామంది కరుడు గట్టినవాళ్లు ఉంటారు. మతం పిచ్చి, జీహాద్‌ పిచ్చి ముదిరిన వారే ఎక్కువ. కానీ, వీడు మాత్రం వారందరికీ భిన్నమైన వాడు.  చాలా టాలెండెడ్‌ టెర్రరిస్టు. దశాబ్దాలుగా పీవోకే నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వీడు ఉగ్రమూకలు భారత్‌లోకి చొరబడేందుకు ఎలా వెళ్లాలో దారులు చెప్పడం వీడి ప్రత్యేకత.  అలా ఒకటి రెండు కాదు.. వందకి పైగా ఉగ్రవాద చొరబాట్లకు తన మాస్టర్‌ మైండ్‌ ను ఉపయోగించాడు. అందుకే వాడిని హ్యూమన్ జీపీఎస్‌గా పిలుస్తారు. వాడే  బాగూఖాన్‌. జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ కీలక ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.హ్యూమన్ జీపీఎస్‌గా పిలవబడే బాగూఖాన్‌(సమందర్‌ చాచా)ను కాల్చిచంపినట్లు ఆర్మీవర్గాలు ఈ రోజు వెల్లడించాయి. తీవ్రవాదులెందరికో దారులు చెప్పిన అతడు మరో ఉగ్రవాదితో కలిసి దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తుండగా ఎన్‌కౌంటర్ చేశామని అధికారులు తెలిపారు.

బాగూఖాన్‌ ది మూడు దశాబ్దాల ఉగ్ర చరిత్ర. 1995 నుంచి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి బాగూఖాన్ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. ఎలాంటి కఠిన మార్గాల్లోనైనా ఉగ్రమూకలు భారత్‌లోకి చొరబడేందుకు బాగూఖాన్‌  సహాయం చేసేవాడు. దానితో అతను చూపించిన మార్గంలో దేశంలోకి చొరబాట్లు  ఎక్కువభాగం విజయవంతం అయ్యాయి. బాగూఖాన్‌ హిజ్బుల్‌ కమాండర్‌గా ఉన్నప్పటికీ.. భౌగోళిక పరిజ్ఞానం (జీపీఎస్‌)  వల్ల అన్ని ఉగ్రసంస్థలకు అతను కావలసిన వాడుగా మారాడు.  అందుకే  హ్యుమన్‌ జీపీఎస్‌గా అతనికంటూ ఓ పేరు స్థిరపడింది.

1995 నుంచి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో తలదాచుకుంటున్న బాగూఖాన్, గత 25 సంవత్సరాలుగా ఉగ్రవాద కార్యకలాపాల్లోచురుగ్గా ఉన్నాడు. గురెజ్ సెక్టార్‌లో ఉన్నటు వంటి అత్యంత కీలక భౌగోళిక ప్రాంతాలపై అతనికి ఉన్న పూర్తి పరిజ్ఞానం కారణంగా, అతన్ని Human GPS గా పిలుస్తారు. ఈ ప్రాంతంలో 100కు పైగా చొరబాటులకు సహకరించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్‌గా, అతను ఇతర ఉగ్రవాద సంస్థలకు కూడా సహాయం అందించాడు.

కాగా బాగూఖాన్‌ ఎన్‌కౌంటర్‌ తో  గత కొన్ని నెలల్లో జమ్మూకశ్మీర్‌లో 23 మంది ఉగ్రవాదులు హతమయ్యారని భద్రతాదళాలు చెబుతున్నాయి. ఇందులో పాకిస్థానీయులు, స్థానిక ఉగ్రవాదులు కూడా ఉన్నారు. బాగూఖాన్‌ ఎన్‌కౌంటర్‌తో నౌషెరా ప్రాంతంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ తగిలినట్టేనని భావిస్తున్నారు. భద్రతా బలగాలు మిగిలిన ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

 ఎన్‌కౌంటర్‌ జరిగిందిలా...

జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి అందిన నిఘా సమాచారం మేరకు, భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా Operation Naushera Nar IVను ప్రారంభించాయి. నౌషెరా నార్ ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాడటానికి ప్రయత్నిస్తున్నారని గుర్తించిన భద్రతా బలగాలు, వారిని ఆపేందుకు ప్రయత్నించాయి. దీన్ని గమనించిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు దిగడంతో,  భద్రతాదళాలు ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో  బాగూఖాన్‌తో సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలం నుంచి రెండు మృతదేహాలు, ఆయుధాలు , పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇంకా ఐదుగురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో దాక్కున్నట్లు నిఘా వర్గాల  సమాచారం మేరకు ఆపరేషన్ కొనసాగుతోంది.

Also Read:TG Crime: మండపం వద్ద పాటలు పెడుతుండగా కరెంట్ షాక్.. నల్గొండలో పెను విషాదం!

Advertisment
తాజా కథనాలు