/rtv/media/media_files/2025/10/09/tejashwi-yadav-2025-10-09-15-05-12.jpg)
One govt job per household, Tejashwi Yadav's big Bihar poll promise
మరికొన్ని రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(bihar-assembly-elections) జరగనున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజస్వి యాదవ్(tejaswi-yadav) సంచలన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇది కేవలం ప్రకటన మాత్రమే కాదని ప్రతిజ్ఞ అంటూ పేర్కొన్నారు.
Also Read: మరోసారి అపర కుభేరుడిగా ముకేశ్ అంబానీ.. ఆస్తి తెలుస్తే షాక్!
Tejashwi Yadav's Big Bihar Poll Promise
'' రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందని శిథిలావస్థలో ఉన్న అధికార ప్రభుత్వానికి తెలియదు. మేము అధికారంలో వస్తే ప్రభుత్వ ఉద్యోగం లేని ప్రతి కుటుంబానికి ఉద్యోగం కల్పించేలా చట్టం తీసుకొస్తాం. ప్రభుత్వం వచ్చిన 20 రోజుల్లోపే ఈ చట్టాన్ని అమలు చేస్తాం. ఇక 20 నెలల్లో బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగం లేని కుటుంబం ఉండదు. దీనిపై మేము ఇప్పటికే డేటా సేకరించి సర్వే కూడా నిర్వహించాం. 20 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రతి ఇంటినీ భయపభ్రాంతులకు గురిచేసింది. మేము మాత్రం ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని'' తేజస్వి యాదవ్ పేర్కొన్నారు.
बिहार के युवाओं के लिए अब तक की सबसे बड़ी घोषणा।
— Kanchana Yadav (@Kanchanyadav000) October 9, 2025
"सरकार बनते ही 20 दिनों के अंदर अधिनियम बनाकर 20 महीनों के भीतर जिस परिवार में सरकारी नौकरी नहीं है, उन्हें दी जाएगी।"
मतलब हर घर सरकारी नौकरी
- श्री तेजस्वी जी pic.twitter.com/UO14N0wxPZ
Also Read: వరల్డ్ టాప్ హండ్రెడ్ లో భారత యూనివర్శిటీలకు దక్కని చోటు..పధ్నాలుగేళ్ళల్లో ఇదే మొదటిసారి
ఇదిలాఉండగా బీహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. నవంబర్ 6, 11న రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 7.42 కోట్లు మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ మొత్తం ఓటర్లలో 3.92 కోట్ల మంది పురుషులు, 3.5 కోట్ల మంది మహిళలు ఉన్నారు.