Delhi: ఢిల్లీని హడలెత్తించిన గాలిదుమారం.. ఆగిపోయిన విమానాలు...!

ఢిల్లీని శుక్రవారం సాయంత్రం గాలి దుమారం వణికించింది. దుమ్ము, ధూళి సృష్టించిన బీభత్సానికి జనం అల్లాడిపోయారు. ప్రజారవాణా స్తంభించిందిపోయింది. అలాగే, విమానాల రాకపోకలపై కూడా ఇది ప్రభావం చూపింది.

New Update
Air India: సిక్‌ లీవ్ పెట్టిన సిబ్బంది..నిలిచిన 70 ఎయిర్‌ ఇండియా విమానాలు!

 

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం బలమైన దుమ్ము, ఈదురు గాలులు విరుచుకుపడ్డాయి. గత పది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ఢిల్లీ వాసులకు ఈ వర్షం వల్ల కొంత ఉపశమనం లభించినప్పటికీ.. జనజీవనం అస్తవ్యస్తమైంది ఢిల్లీలో వర్షానికి చెట్లు కూలి రోడ్డలపై పడటంతో ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయాయి. గాలి దుమారంతో పలు విమానాల రాకపోకల్లో ఆలస్యం అయ్యింది.  దీంతో వందల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా కనీసం 15 విమానాలను దారి మళ్లించినట్టు సమాచారం.

ఎయిరిండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థలు X (ట్విట్టర్) ద్వారా సూచనలు జారీ చేసినప్పటికీ, చాలా మంది ప్రయాణికులు తమ కష్టాలను సోషల్ మీడియాలో వెళ్లగక్కుతున్నారు.‘మాకు శ్రీనగర్ నుంచి ఢిల్లీ... అక్కడి నుంచి ముంబయికి సాయంత్రం 4 గంటలకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది... మా విమానం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉండగా, గాలి దుమారం కారణంగా చండీగఢ్‌కు మళ్లించారు.. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు తిరిగి ఢిల్లీకి తీసుకొచ్చారు.. ఆ తర్వాత ఢిల్లీలో ముంబయికి వెళ్లే మరో విమానం ఎక్కించారు.. మేము సుమారు 4 గంటల పాటు అందులో విమానంలో కూర్చున్నాం.. ఆ తర్వాత మళ్లీ దింపి, మళ్లీ సెక్యూరిటీ చెక్ చేయించారు. 

ఇప్పుడు ఉదయం 8 గంటలు అవుతోంది.. మేము ఇంకా విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నాం.. మా విమానం ఇంకా బయలుదేరలేదు’ ఎయిరిండియా ప్రయాణికుడు ఒకరు వాపోయారు.కొంతమంది ప్రయాణికులు సోషల్ మీడియా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో పరిస్థితిని తెలియజేసే ఫోటోను పోస్ట్ చేస్తూ. ‘అత్యంత అస్తవ్యస్తమైన, తప్పుదోవ పట్టించే ప్రపంచ స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం. న్యూఢిల్లీ... బస్ స్టాండ్ కంటే అధ్వాన్నంగా ఉంది’ అని మండిపడ్డాడు.14 గంటలకు పైగా ఢిల్లీ విమానాశ్రయంలో చిక్కుకుపోయాను...మీకు మీ ప్రయాణికుల పట్ల బాధ్యత, నిబద్ధత లేదు... మీరు ఈ స్థానంలో ఉండటానికి అర్హులు కాదు’ ఎయిరిండియాను మరో ప్రయాణికుడు ట్యాగ్ చేశాడు.

Also Read: Hyderabad Mandi Biryani: హైదరాబాద్‌ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..

అయితే, ఎయిరిండియా మాత్రం ఢిల్లీ నుంచి, ఢిల్లీకి వచ్చే విమానాలు వర్షం కారణంగా ఆలస్యం అయ్యాయని పేర్కొంది. ‘విమానాశ్రయ బృందం తక్షణ పరిష్కారాన్ని నిర్ధారించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తోంది.. అంతరాయానికి చింతిస్తున్నాం.. ప్రయాణికులు సంయమనం పాటించాలని అభ్యర్థిస్తున్నాం" అని పేర్కొంది. ఇండిగో, స్పైస్ జెట్ సైతం ఇలాంటి ప్రకటనే చేశాయి.. ఢిల్లీ విమానాశ్రయం కూడా ప్రయాణికులకు విమానాల ఆలస్యం గురించి తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశాయి.

Also Read:  Tirumala: తిరుమలలో ఘోర అపచారం.. అధికారులు అసలేం చేస్తున్నారు? మండి పడుతున్న భక్తులు!

‘ఢిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, విమానాశ్రయంలోని కొన్ని విమానాలు ప్రభావితమయ్యాయి. అప్‌డేట్ కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు... ఈ అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం’ అని వివరించింది.

గత రెండు రోజుల నుంచి ఢిల్లీలో ఈదురు గాలులు, పిడిగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలను బలమైన దుమ్ము తుఫాను కమ్మేసింది. ఇది రాజధానిలోని కొన్ని ప్రాంతాలలో భారీ నష్టాన్ని మిగిల్చింది. చెట్ల కొమ్మలు విరిగి రోడ్లు, వాహనాలపై పడ్డాయి. అటు, భారత వాతావరణ శాఖ  సైతం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఢిల్లీలో 'ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Also Read: Tirumala: తిరుమలలో ఘోర అపచారం.. అధికారులు అసలేం చేస్తున్నారు? మండి పడుతున్న భక్తులు!

Also Read: MLC Vijayasanthi: బజారుకీడ్చి అతి దారుణంగా చంపేస్తా..విజయశాంతి దంపతులకు బెదిరింపులు!

rains | cancel | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు