Hyderabad Mandi Biryani: హైదరాబాద్‌ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..

హైదరాబాద్ వాసులకు నోరూరించే ఆఫర్. ఫ్రీ మండి బిర్యానీ. అది కూడా ఎలాంటి షరతులూ లేకుండా.హైటెక్ సిటీలో బిగ్ ప్లేట్ మండి రెస్టారెంట్ పెట్టి మూడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా భోజన ప్రియులను ఆకర్షించేందుకు ఫ్రీ మండి బిర్యానీ ఆఫర్‌ ని పెట్టినట్లు తెలుస్తోంది.

New Update
mandi (1)

హైదరాబాద్‌ అంటేనే భోజన ప్రియులకు అడ్డా అని చెప్పొచ్చు. నోరూరించే వంటకాలతో ఎన్నో రెస్టారెంట్లు, హోటళ్లు భోజన ప్రియులకు నిత్యం స్వాగతం పలుకుతూనే ఉంటాయి. ఎన్ని వెరైటీ వంటకాలున్నా.. హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ. బిర్యానీకి ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో మండి బిర్యానీకి కూడా అదే రేంజ్‌లో ఫ్యాన్స్‌ ఉంటారనే విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడిప్పుడే మండి బిర్యానీకి క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో.. యువతను ఆకర్షించేందుకు చాలా రెస్టారెంట్లు రకరకాల ఆఫర్లు పెడుతున్నాయి.

Also Read: Google LayOffs: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!

"మీ పుట్టిన రోజా.. అయితే ఫ్రీగా బిర్యానీ లాగించేయొచ్చు.. జస్ట్ ఆధార్ కార్డు చూపిస్తే చాలు.. తిన్నంత బిర్యానీ.." అంటూ ఇప్పటికే పలు రెస్టారెంట్లు ఆఫర్లు ప్రకటించేశారు. కాగా.. ఇప్పుడు ఓ మండి రెస్టారెంట్ ఇలాంటి అద్భుతమైన ఆఫర్‌నే ప్రకటించింది. అయితే.. ఇక్కడ ఆధార్ కార్డు కూడా చూపించాల్సిన అవసరం లేదు. ఎంచక్కా రావొచ్చు మండి బిర్యానీ లాగించేయొచ్చు. మరి ఈ అద్దిరిపోయే ఆఫర్ ఎక్కడ.. ఎప్పుడు.. తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.

Also Read: Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

హైటెక్ సిటీలోని ప్రముఖ రెస్టారెంట్ బిగ్ ప్లేట్ మండి  తమ కస్టమర్లకు ఈ అద్దిరిపోయే ఆఫర్ ప్రకటించింది. సోమవారం రోజున తమ రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లందరికీ ఉచిత మండి విందు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విందు భోజనం ఆఫర్‌ మధ్యాహ్నం 12:00 గంటల నుంచి మొదలవుతుంది. అయితే.. ఈ ఆఫర్ కోసం ఎలాంటి ఆధార్ కార్డులు, ఐడీ కార్డులు చూపించాల్సిన అవసరం లేదని రెస్టారెంట్ యాజమాన్యం ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చింది.

కొన్ని చిన్న చిన్న కండీషన్లు మాత్రం ఉన్నట్టుగా యాజమాన్యం వివరించింది. ఒక్కో వ్యక్తికి ఒక్కసారి మాత్రమే మండి వడ్డించనున్నారు. అయితే.. ఇది అన్ లిమిటెడ్ మాత్రం కాదండోయ్. ఒక్కరికి ఒక్క లెగ్ పీస్‌తో పాటు సింగిల్ మండి రైస్ ఇవ్వనున్నారు. ఇద్దరు వెళ్తే రెండు లెగ్‌ పీసులు ఇద్దరికి సరిపోయే మండి రైస్, ముగ్గురు వెళ్తే మూడు లెగ్ పీసులు ముగ్గురికి సరిపోయే మండి రైస్.. ఇలా ఎంత మంది వెళ్తే అంత మందికి సరిపోయేంత మాత్రమే ఇవ్వనున్నట్టు యాజమాన్యం చెప్పింది.

మరి మండే రోజు మండి బిర్యానీ ఫ్రీగా ఇవ్వటమేంటీ అనుకుంటున్నారా..? అసలు విషయం ఏంటంటే... బిగ్ ప్లేట్ మండి రెస్టారెంట్ పెట్టి ఆరోజుకి మూడేళ్లు అవుతుందంటా. మూడో వార్షికోత్సవం సందర్భంగా.. తమ కస్టమర్లతో పాటు మిగతా భోజన ప్రియులను ఆకర్షించేందుకు ఈ ఆఫర్ పెట్టినట్టు సమాచారం. . ఈ బిగ్ ప్లేట్ మండి.. హైటెక్ సిటీలో శిల్పారామానికి ఎదురుగా ఉంటుందని సమాచారం.

Also Read: Hanuman Jayanti-2025: హనుమాన్ జయంతి నాడు ఇలా చేయండి.. మీ శని, దరిద్రం పరార్!

Also Read: South Africa: పెంగ్విన్ కారణంగా కూలిపోయిన హెలికాఫ్టర్

mandi | biryani | telangana | hyderabad | mandi biryani | free | offer | latest-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు