/rtv/media/media_files/2025/05/25/HlCE0TQNQL1LBtgizXQr.jpg)
Panic Grips Patna After Group Fires In Air, 6 Cops Suspended
బిహార్ రాజధాని పాట్నాలో ఆసక్తిరక ఘటన చోటుచేసుకుంది. ఓ పార్కింగ్ వివాదం నేపథ్యంలో కారులో ఉన్న వ్యక్తులు గాల్లో కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దాలకు అక్కడి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అక్కడికి వచ్చిన ఏడీజీ సెక్యూరిటీ గార్డు కూడా గాల్లోకి కాల్పుల జరిపాడు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఉన్నతాధికారులు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
Also Read: కేరళ తీరంలో మునిగిపోయిన భారీ షిప్.. 24 మంది సిబ్బంది
ఇక వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం బోరింగ్ కెనాల్ రోడ్డు ప్రాంతంలో పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో SUV లో ఉన్న వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ సమయంలో శాంతి భద్రతల అదనపు ఏడీజీ పంకజ్ దరాద్ ఓ మీటింగ్ నుంచి తిరిగి వెళ్తున్నారు. ఆయన కాల్పుల శబ్ధ వినడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. అయితే ఏడీజీ సెక్యూరిటీ కూడా గాల్లోకి కాల్పులు జరిపాడు.
Also Read: తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. RDXతో పేల్చేస్తామన్న దుండగులు
దీంకో ముందుగా గాల్లోకి కాల్పులు జరిపిన ఆ కారులోని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ ప్రాంతంలో స్థానికులు భయాందోళన చెందడంతో పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. గాల్లోకి కాల్పులు జరపడమే కాకుండా నంబర్ ప్లేట్ లేని కారులో పారిపోయిన నిందుతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు పోలీసులను కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఒక ఎస్సై, ఇద్దరు ఏస్సైలు, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. వీళ్లలో ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు.
Also Read: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ మరో బాంబ్.. వాళ్ల వివరాలు కావాలని డిమాండ్
Also Read: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే
telugu-news | national-news | bihar | rtv-news | police