Pakistan Drones: భారత్ పైకి డ్రోన్ ఎటాక్.. మళ్లీ తెగబడ్డ పాక్!

జమ్మూ కాశ్మీర్‌ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్తాన్ నుంచి వచ్చిన రెండు డ్రోన్‌లను భారత భద్రతా దళాలు గుర్తించాయి. ఈ డ్రోన్‌లు భారత గగనతలంలోకి చొరబడినట్లు గుర్తించిన వెంటనే సైనికులు వాటిపై కాల్పులు జరిపారు.

New Update
Pakistan Drones

జమ్మూ కాశ్మీర్‌(Jammu and Kashmir) పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్తాన్ నుంచి వచ్చిన రెండు డ్రోన్‌లను భారత భద్రతా దళాలు గుర్తించాయి. ఈ డ్రోన్‌లు భారత గగనతలంలోకి చొరబడినట్లు గుర్తించిన వెంటనే సైనికులు వాటిపై కాల్పులు జరిపారు. అయితే, కాల్పులు ప్రారంభం కాగానే ఆ డ్రోన్‌లు(Pakistan drones) తిరిగి పాకిస్తాన్ వైపు వెళ్లిపోయాయని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో మెంధార్‌-బల్నోయి, గుల్పూర్ సెక్టార్‌లలో ఈ డ్రోన్‌ల కదలికలు కనిపించాయి. సరిహద్దుల్లోని భారత సైనికులు ఈ కదలికలను వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. ఎలాంటి అటాక్ జరగకుండా నిరోధించేందుకు వెంటనే వాటిపై కాల్పులు జరిపినట్లు సైనికాధికారులు తెలిపారు.

Also Read :  టీచర్‌కు 215ఏళ్లు జైలు శిక్ష.. ఇంతకీ ఆ నీచుడు ఏం చేశాడో తెలుసా?

Pakistani Drones Spotted By Security Forces

పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, సరిహద్దుల్లో ఆయుధాలు, మాదక ద్రవ్యాలను సరఫరా చేయడానికి డ్రోన్‌లను ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో, భద్రతా దళాలు నిరంతరం సరిహద్దులపై నిఘా ఉంచాయి. తాజా ఘటన నేపథ్యంలో, ఈ డ్రోన్‌లు ఏవైనా వస్తువులను పడవేశాయా అని తెలుసుకోవడానికి భద్రతా దళాలు ఆ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. డ్రోన్‌లు కనిపించిన ప్రాంతాల్లోని అడవులు, రహదారులను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటివరకు అనుమానాస్పదంగా ఏమీ లభ్యం కాలేదని, అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

గతంలో కూడా పలు సందర్భాల్లో సరిహద్దుల్లో పాకిస్తానీ డ్రోన్‌లు కనిపించాయి. వాటిని భారత సైన్యం సమర్థవంతంగా కూల్చివేసింది లేదా తిరిగి వెనక్కి పంపింది. పూంచ్ జిల్లాలో జరిగిన తాజా సంఘటన, సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. పాకిస్తాన్ వైపు నుండి వచ్చే ఇలాంటి చొరబాట్లను నిరోధించడానికి భారత సైన్యం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది.

Also Read :  యూట్యూబర్లకు బిగ్ షాక్.. అలా చేస్తే కుదరదు

Advertisment
తాజా కథనాలు