BIG BREAKING: పాక్ దాడి.. భారత కీలక అధికారి మృతి!

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి పట్టణంపై పాక్ షెల్లింగ్‌లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో భారత కీలక అధికారి మృతి చెందారు. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్‌ రాజ్ కుమార్ తాప తీవ్రంగా గాయపడి మృతి చెందారు.

New Update

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి పట్టణంపై పాక్ షెల్లింగ్‌లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో భారత కీలక అధికారి మృతి చెందారు. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్‌ రాజ్ కుమార్ తాప తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఇతని మృతి పట్ల జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు. అయితే 
శనివారం వేకువజామున పాక్ భారత్‌పై దాడులకు దిగింది. సరిహద్దు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లు వినిపించాయి. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా ఆపి వేసి వెంటనే బ్లాక్ అవుట్ పాటించారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు

ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు

తీవ్రంగా దాడులు చేస్తామని..

ఇదిలా ఉండగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌పై విరుచుకుపడింది. కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా పాక్ జమ్మూకశ్మీర్, భారత సరిహద్దుల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడింది. వీటిని ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ఈ క్రమంలో పాక్ భారత్ ఆర్మీపై పూర్తి స్థాయిలో దాడులు చేస్తామని ప్రకటించింది. శనివారం ఉదయం పాక్ ఆర్మీ ప్రెస్ మీట్ పెట్టి ఈ నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ బన్‌యన్ ఉల్ మర్సూస్ అనే పేరుతో భారత్‌పై తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామని ప్రకటించింది. 

ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!

ఇది కూడా చూడండి: IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు