/rtv/media/media_files/2025/05/15/e2MBlHdKPzEVuT0GKY7S.jpg)
President Murmu questioned Supreme Court on approval of the bills
Droupadi Murmu: రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువులు నిర్ణయించడంపై ద్రౌపది ముర్ము సంచలన లేఖ రాశారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధన లేనప్పుడు బిల్లులకు తమ ఆమోదం తెలపాలని సుప్రీంకోర్టు కాలపరిమితిని ఎలా నిర్ణయించగలదని ప్రశ్నించారు. రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలు, న్యాయపరమైన జోక్యం, సమయ పరిమితులను నిర్ణయించడం వంటి 14 అంశాలపై ముర్ము వివరణలు కోరారు.
Questions referred by President Droupadi Murmu to the Supreme Court as per Article 143(1) of the Constitution in relation to the timelines fixed for Governors and President to act on Bills. pic.twitter.com/k6T7ecA6kc
— Live Law (@LiveLawIndia) May 15, 2025
Also Read : సీటు కోసం జుట్టు పట్టుకొని కొట్టుడే కొట్టుడు - వీడియో చూస్తే!
ఆ అధికారం గవర్నర్ కు లేదు..
తమిళనాడు గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం నేపథ్యంలో ఈ అంశం తెరపైకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ బిల్లులను నిలిపివేసే వీటో అధికారం గవర్నర్ కు లేదని సుప్రీంకోర్టు ఏప్రిల్ 8న స్పష్టం చేసింది. ఇదే సమయంలో గవర్నర్ పంపిన బిల్లుపై రాష్ట్రపతి 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని ఏప్రిల్ 11న ఆదేశించింది. దీంతో ఎన్నడూ లేనివిధంగా ఈ అంశంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించడంపై ద్రౌపదీ ముర్ము ప్రశ్నలు లేవనెత్తారు.
Also Read : ఐపీఎల్ ఓనర్లకు బిగ్ రిలీఫ్.. నిర్ణయం మార్చుకున్న విదేశీ బోర్డ్స్!
ముర్ము 14 ప్రశ్నలు:
1. గవర్నర్ ముందుకు ఒక బిల్లు వచ్చినప్పుడు దానిని పాస్ చేసేందుకు రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి?
2. నిర్ణయం తీసుకునేటప్పుడు గవర్నర్ మంత్రి మండలి సలహాకు కట్టుబడి ఉంటారా?
3. గవర్నర్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయవచ్చా?
4. గవర్నర్ నిర్ణయాలపై న్యాయ సమీక్షను ఆర్టికల్ 361 పూర్తిగా నిరోధించగలదా?
5. రాజ్యాంగంలో గవర్నర్ కు కాలపరిమితి లేకపోతే, కోర్టు ఏదైనా కాలపరిమితిని నిర్ణయించగలదా?
6. రాష్ట్రపతి నిర్ణయాన్ని కోర్టులో కూడా సవాలు చేయవచ్చా?
7. రాష్ట్రపతి నిర్ణయాలకు కూడా కోర్టు కాలపరిమితి విధించవచ్చా?
8. రాష్ట్రపతి సుప్రీంకోర్టు అభిప్రాయం కోరడం తప్పనిసరి కాదా?
9. చట్టం అమల్లోకి రాకముందే రాష్ట్రపతి, గవర్నర్ నిర్ణయాలను కోర్టు వినగలదా?
10. ఆర్టికల్ 142 ఉపయోగించి సుప్రీంకోర్టు రాష్ట్రపతి లేదా గవర్నర్ నిర్ణయాలను మార్చగలదా?
11. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన చట్టం గవర్నర్ అనుమతి లేకుండా అమలు చేయబడుతుందా? లేదా?
12. రాజ్యాంగ వివరణకు సంబంధించిన కేసులను సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి పంపడం తప్పనిసరి కాదా?
13. రాజ్యాంగానికి లేదా ప్రస్తుత చట్టాలకు విరుద్ధంగా ఉన్న ఆదేశాలు/ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఇవ్వగలదా?
14. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాన్ని సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరించగలదా?
Also Read : ఇకపై 'స్పాటిఫై' లో ఆ పాటలు ఉండవు..!
అసలేం జరిగిందంటే..
తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వంలో శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను గవర్నరు ఆర్.ఎన్.రవి ఆమోదించకుండా జాప్యం చేశారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. బిల్లులు తన వద్దే ఉంచుకోవడం సరైనది కాదని ఏప్రిల్‌లో ధర్మాసనం చెప్పింది. ఇందుకోసం 415 పేజీల తీర్పు వెల్లడిస్తూ.. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/గవర్నర్ 3 నెలల్లోగా ఆమోదించాలి. లేదంటే తిప్పి పంపించాలని ఆదేశించింది. ఒకవేళ బిల్లును ప్రభుత్వానికి తిరిగి పంపిస్తే కారణాలు వివరించాలని సూచించింది. గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే ప్రభుత్వం న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని క్లారిటీ ఇచ్చింది. ఆర్టికల్ 142 ప్రకారం దీనిపై నిర్ణయం తీసుకునే సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్ స్పష్టం చేశారు.
Also Read : షెడ్లో నక్కిన టెర్రరిస్టులు.. షాకింగ్ వీడియోలు!
droupadi-murmu | suprem court | governer | telugu-news | today telugu news