Tourist Family: స్టార్ కాస్ట్, భారీ ప్రమోషన్స్ లేకపోయినా.. కొన్ని సినిమాలు కేవలం మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటిదే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన తమిళ చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ' బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. శ్రీలంకకు వలస వెళ్లిన కుటుంబ కథా నేపథ్యంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఎలాంటి అంచనాలు లేకుండా
మే 1న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కాస్త నిదానంగా ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రేక్షకుల సానుకూల స్పందనతో ఊపందుకుంది. 3వ రోజుకు కలెక్షన్స్ పుంజుకున్నాయి. రెండవ రోజు ₹1.7 కోట్లు కలెక్ట్ చేయగా.. మూడవ రోజు ₹2.7 కోట్లకు పెరిగాయి. నాల్గవ రోజు మరింత ఆకట్టుకునే విధంగా ₹3.75 కోట్లకు చేరుకున్నాయి. తక్కువ బడ్జెట్ తో భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తోంది. ఇవి కేవలం తమిళ్ బాక్స్ ఆఫీస్ లెక్కలు మాత్రమే. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ. 12 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
#TouristFamily a big hit in #Kerala. Started slowly on day 1, picked up very well on day 2 & 3. Day 4 Sunday gross was more than first 3 days total gross!
— Sreedhar Pillai (@sri50) May 5, 2025
Despite stiff competition, promotions by @MillionOffl including Press & Celebrity show before release created positive WOM. pic.twitter.com/5ORgLm7JPK
డెబ్యూ డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో శశికుమార్, సిమ్రాన్, యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్, ఎం.ఎస్. భాస్కర్, రమేష్ తిలక్, బక్స్, ఎలాంగో కుమారవేల్, శ్రీజా రవి కీలక పాత్రలు పోషించారు.
మూవీ స్టోరీ
శ్రీలంకలో ఆర్థిక పతనం, COVID సంక్షోభం తర్వాత తమిళనాడుకు అక్రమంగా వలస వెళ్ళిన ధర్మదాస్ (శశికుమార్), అతని భార్య (సిమ్రాన్), వారి ఇద్దరు కుమారుల నేపథ్యంలో సాగే కుటుంబం కథ ఇది. వారు కొత్త జీవితంలో స్థిరపడటానికి ప్రయత్నించే క్రమంలో ఆ కుటుంబం ఎదుర్కున్న సవాళ్లు ఈ చిత్రంలో చూపించారు.
latest-news | cinema-news | telugu-cinema-news