/rtv/media/media_files/2025/03/04/qK6JamV3x6xR16J3Auiv.jpg)
ayodhya
అయోధ్య రామమందిరంతో పాటు దేశవ్యాప్తంగా కొన్ని మతపరమైన సంస్థలపై దాడికి పాకిస్థాన్ ఉగ్రవాదులు పన్నిన కుట్రను గుజరాత్ పోలీసుల భగ్నం చేశారు. గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం పోలీసులు.. హర్యానాలో ఫరీదాబాద్‌లోని ఒక ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతడి వద్ద రెండు హ్యాండ్ గ్రనేడ్‌లు, మ్యాగిజైన్లు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో ఫరీదాబాద్ ఎస్టిఎఫ్‌తో కలసి సంయుక్తంగా గుజరాత్ ఏటీఎస్ ఈ ఆపరేషన్ ను ప్రారంభించింది. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టి.. యూపీకి చెందిన యువకుడ్ని ఫరీదాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో అయోధ్య రామ మందిరం కూడా ఉన్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారు మట్టి ముట్టుకున్న బంగారం అవుతుంది...
భారీ ఉగ్ర కుట్ర...
అరెస్టైన వ్యక్తిని ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కు చెందిన 19 ఏళ్ల అబ్దుల్ రెహమాన్‌గా పోలీసు అధికారులు గుర్తించారు. అతడి వద్ద లభించిన హ్యాండ్ గ్రనేడ్‌లను నిర్వీర్యం చేశారు. అనుమానితుడికి పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధం, ప్లాన్లు గురించి మరింత సమాచారం రాబట్టేందుకు అతడ్ని గుజరాత్‌కు తరలిస్తున్నారు. రెహమాన్ అరెస్టుతో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడికి పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ సహా అక్కడి ఇతర ఉగ్రవాద సంస్థలతోనూ సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలుసార్లు రామమందిరం, పరిసర ప్రాంతాల్లో అతడు రెక్కీ నిర్వహించి, కీలక సమాచారాన్ని ఐఎస్ఐకు చేరవేశాడని అంటున్నారు.
Also Read:Trump: పుతిన్ కంటే వాళ్లే యమ డేంజర్.. జాగ్రత్తగా ఉండాలంటూ ట్రంప్ సంచలన పోస్ట్!
ఫైజాబాద్‌లో మటన్ దుకాణం నడుపుతోన్న అబ్దుల్.. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు తెలిపారు. ఫైజాబాద్ నుంచి ఫరీదాబాద్‌కు చాలా సందర్భాల్లో రైల్లో పర్యటించినట్టు గుర్తించారు. అక్కడ నుంచి హ్యాండ్ గ్రనేడ్లు తీసుకుని, అయోధ్యకు రావాలని ప్రయత్నిస్తుండగా అరెస్టయ్యాడు. ఫరీదాబాద్‌లోని పాలి అనే ప్రాంతంలో ఒంటరిగా ఉండే ఓ ఇంటిలో ఆయుధాలను కూడా దాచిపెట్టినట్టు తెలుస్తోంది.
ఆదివారం సాయంత్రం నాలుగు గంటల పాటు సోదాల నిర్వహించిన అనంతరం ఏటీఎస్ పోలీసులు గ్రనేడ్లను అక్కడ స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో అటుగా ఎవరూ కారకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం గుజరాత్ ఎటిఎస్ చేపట్టిన ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. తాజా పరిణామాలతో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రామాలయం దగ్గర భద్రతను పటిష్ఠం చేశారు.
Also Read: Ranveer Allahbadia: రణవీర్ అల్హాబాదియా వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు