Rashmika ban: నట్టు, బోల్ట్ బిగించాల్సిందే.. రష్మికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బోల్డ్ కామెంట్స్!

నేషనల్ క్రష్ ర‌ష్మిక‌ మందన్న నోటిదూలతో మరోసారి వివాదంలో చిక్కుకుంది. తాను హైదరాబాదీనని చెప్పుకోవడంతో కన్నడలో బ్యాన్ చేయాలనే డిమాండ్స్ మొదలయ్యాయి. ఇండస్ట్రీ వాళ్లకు నట్లు, బోల్టులు బిగించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ ఫైర్ అయ్యారు. 

New Update
jannada rashmika

jannada rashmika Photograph: (jannada rashmika)

Rashmika: నేషనల్ క్రష్ ర‌ష్మిక‌ మందన్న నోటిదూలతో మరోసారి వివాదంలో చిక్కుకుంది. తాను హైదరాబాదీనని చెప్పుకోవడంతో కన్నడలో బ్యాన్ చేయాలనే డిమాండ్స్ మొదలయ్యాయి. ఇండస్ట్రీ వాళ్లకు నట్లు, బోల్టులు బిగించాల్సిన అవసరం ఉందని -కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ ఫైర్ అయ్యారు. 

ఇండస్ట్రీని నిర్లక్ష్యం చేస్తోందని..

ఈ మేరకు 16వ బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వివాదం చోటుచేసుకుంది. మార్చి 1న మొదలైన వేడుకలకు సినీ ప్రముఖులు హాజరుకాకపోవడంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చలనచిత్ర రంగంపై తనకు చాలా కోపంగా ఉందన్నారు. వారికోసమే నిర్వహిస్తున్న ఈ వేడుకకు పది మంది కూడా రాలేదు. వారికి ప్రభుత్వం సాయం చేయాలి. థియేటర్లు, చిత్ర నిర్మాణానికి రాయితీలివ్వాలి. మేము అవకాశం ఇవ్వకుంటే థియేటర్లు నడపలేరు. ఎవరి నట్లు, బోల్ట్‌లు ఎలా సరిచేయాలో మాకు బాగా తెలుసు అన్నారు. 

Also Read: మార్చి నుంచే దంచికొట్టనున్న ఎండలు.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే వడదెబ్బే

కన్నడను అగౌరవపరిచింది. 

అయితే తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రవి గనిగ సైతం రష్మికపై మండిపడ్డారు. ఈ చలనచిత్రోత్సవాలకు హాజరయ్యేందుకు రష్మిక నిరాకరించడం దారుణం అన్నారు. 'రష్మిక కన్నడను విస్మరించింది. కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ' తో తన కెరీర్‌ను ప్రారంభించిన విషయం మరిచిపోవద్దు. ఆమెను ఆహ్వానించేందుకు ఆమె ఇంటికి 12 సార్లు మనిషిని పంపించాం. కానీ ఆమె రాలేదు. తన ఇల్లు హైదరాబాద్‌లో ఉందని చెబుతోంది. కనీసం గంట సమయం లేదా. కన్నడను అగౌరవపరిచిన రష్మికకు మనం గుణపాఠం నేర్పించాల్సిందే. శివకుమార్ చెప్పినట్లు నట్టు, బోల్ట్ బిగించాల్సిన సమయం వచ్చింది' అంటూ ఫైర్ అయ్యారు. దీంతో కన్నడ ఫ్యాన్స్ 'బ్యాన్ రష్మిక' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

Also Read: ట్రంప్ పిలిస్తే మళ్లీ వెళ్లి మాట్లాడుతా.. జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు