/rtv/media/media_files/2025/03/03/TYUHYfbnKLDi9VUjOUBg.jpg)
Ranveer Allahbadia
ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia).. తల్లిదండ్రుల శృంగారం గురించి ఓ అమ్మాయిని అడిగిన ప్రశ్న ఇటీవల తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో చిక్కుకున్న రణవీర్‌కు తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) లో ఊరట దక్కింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆగిపోయిన ఆయన పోడ్‌కాస్ట్ ‘ది రణ్‌వీర్ షో’తో సహా ఇతర షోలను తిరిగి ప్రారంభించుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇండియాస్ గాట్ టాలెంట్ వేదికగా జరిగిన ఓ షోలో రణవీర్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి.
Also Read: నడిరోడ్డుపై వధువు కిడ్నాప్.. ఊరేగింపు మధ్యలో ఎలా ఎత్తుకెళ్లారంటే?
Supreme Court - Ranveer Allahbadia
దీంతో రణవీర్ చేస్తున్న షోలు ఆగిపోయాయి. తన ఇంటర్వ్యూలు, షోలు చేసుకునే అవకాశం కల్పించాలని, తనపై నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని కోరుతూ రణవీర్ సుప్రీంకోర్టును ఇటీవల ఆశ్రయించారు. తాను చేసే షోల వద్ద దాదాపు 280 మంది ఆధారపడ్డారని.. షోలు ఆగిపోతే వాళ్లకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read : Oscar Awards 2025: వేశ్యతో ప్రేమలో పడిన కథ.. 'అనోరా' చిత్రానికి ఏకంగా ఐదు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డు!
ఇటీవలే ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రణవీర్‌కు మొట్టికాయలు వేసింది. విచారణను వాయిదా వేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఆగిపోయినటువంటి రణవీర్ అల్హబాదియా షోలు తిరిగి ప్రారంభించేందుకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు కంటెంట్ క్రియేటర్లపై కూడా కొన్ని ప్రమాణాలు పాటించాలంటూ సూచనలు చేసింది.
Also Read : Lady Aghori: తణుకులో అఘోరీ సంచలనం.. వాన్ని చంపేస్తానంటూ బీభత్సం! (VIDEO)