BIG BREAKING: శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పై  పాక్ డ్రోన్ దాడి - LIVE VIDEO

మళ్ళీ దాడులను మొదలెట్టిన పాకిస్తాన్ ఎయిర్ పోర్ట్ లను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈరోజు కాల్పులు మొదలైన కొద్దిసేపటికే శ్రీనగర్ విమానాశ్రయం దగ్గరలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.  ఆ తర్వాత కొద్దిసేపటికే జమ్మూ కాశ్మీర్ ఎయిర్ పోర్ట్ దగ్గరలో పేలుళ్లు వినిపించాయి. 

author-image
By Manogna alamuru
New Update
airport

Srinagar Air Port

సాంబా, పఠాన్‌కోట్, అమృత్‌సర్, జైసల్మేర్, బార్మెర్, పంజాబ్ లోని పఠాక్ కోఠ్ ఇంకా  ఇతర ప్రాంతాలపై పాకిస్తాన్ డ్రోన్‌లను చూశామని, భారత దళాలు వాటిపై దాడి చేశాయని రక్షణ అధికారులు తెలిపారు. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కుంటున్నామని చెప్పారు. ఈ క్రమంలో శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ ఎయిర్ పోర్ట్ ల దగ్గరలో బాంబులు పేలుళ్లు వినిపించడంతో భారత ఆర్మీ అప్రమత్తం అయింది. మే 15వ తేదీ వరకు ఎయిర్ పోర్ట్ ను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 

Also Read :  PIB Fact Check: బుద్ది మార్చుకోని పాక్.. భారత మహిళా పైలెట్ పట్టుబడ్డారంటూ ఫేక్ న్యూస్!

Also Read :  గ్రానైట్‌ లారీ బోల్తా.. ముగ్గురు స్పాట్‌లోనే!

Also Read :  'ఆపరేషన్ సిందూర్' కు పోటీగా పాక్ ఆపరేషన్ 'బున్యాన్ ఉల్ మర్సూస్'.. దాని అర్థం ఏంటో తెలుసా?

 

Also Read :  Pahalgam Terror Attack : పాకిస్తాన్‌కు మరో దెబ్బ..జీ7 దేశాల కీలక ప్రకటన.

నగరం అంతా బ్లాక్ అవుట్..

శ్రీనగర్‌లో, ముందు జాగ్రత్త చర్యగా స్థానికులకు మసీదు లౌడ్ స్పీకర్లను ఉపయోగించి లైట్లు ఆపివేయమని తెలియజేశారు. ప్రస్తుతం అక్కడ పూర్తిగా బ్లాక్ అవుట్ ఉంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ పేలుళ్లను ధ్రువీకరించారు. నగరం అంతటా సైరన్లు వినిపిస్తున్నాయి. ఇళ్ళల్లో నుంచి ప్రజలు బయటకు రావొద్దని సూచిస్తున్నారు. పాక్ డ్రోన్లను భారత ఆయుధాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి. 

 

today-latest-news-in-telugu | air-port | attacks | india pakistan war 2025

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు