/rtv/media/media_files/2025/08/28/blue-egg-2025-08-28-15-27-47.jpg)
Out Of The Blue, Davanagere Hen Changes Colour Of Its Egg, Draws Crowds To The Village
కోడిగడ్లు ఏ రంగులో ఉంటాయని అడిగితే ఏమని చెబుతారు. అది కూడా తెలీదా తెలుపు రంగు అని టక్కునా సమాధానం చెప్పా్స్తారు. కానీ ఇప్పుడు చెప్పే విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే ఓ కోడి నీలం రంగులో గుడ్డు(Hen Blue Egg) పెట్టి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. కర్ణాటక(Karnataka) లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేవనగరి జిల్లాలోని నల్లూరు గ్రామంలో సయ్యద్ నూర్ అనే వ్యక్తి కోళ్లను పెంచుతున్నారు. ఆయన దగ్గర 10 నాటుకోళ్లు ఉన్నాయి.
Davanagere Hen Changes Colour Of Its Egg
అందులో ఒక కోడి ఇటీవలే ఓరోజు నీలం రంగులో గుడ్డు(Blue Egg) పెట్టింది. సాధారణంగా కొడిగుడ్డు తెల్లగా ఉంటుంది. అది నీలిరంగులో ఉండటం చూసి సయ్యద్ షాకైపోయాడు. చుట్టుపక్కల వాళ్లకి ఈ విషం తెలియడంతో ఆ గుడ్డును చూసేందుకు చాలామంది ఎగబడ్డారు. ఆ గుడ్డును సయ్యద్ భద్రంగా దాచిపెట్టాడు. చివరికి ఈ విషయం జంతు సంరక్షణ అధికారులకు తెలిసింది. వాళ్లు ఆ ఇంటికి వచ్చి కోడిని పరిశీలించారు. అయితే కొన్నిసార్లు కోళ్లు ఆకుపచ్చ రంగులో గుడ్లు పెడతాయని తెలిపారు.
Also Read: ట్రంప్ టారిఫ్‌లా.. రష్యా చమురు కొనుగోళ్లా.. ఇండియాకి ఏది బెటర్..?
నీలం రంగులో గుడ్డు పెట్టడం మాత్రం చాలా అరుదని పేర్కొన్నారు. కోడి క్లోమంలో బిలివర్డిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుందని దాన్నివల్లే ఈ గుడ్డు నీలం రంగులో వచ్చి ఉండొచ్చని అంటున్నారు. అంతేకాదు కోళ్లలో జన్యుపరమైన సమస్యల వల్ల కూడా పలుమార్లు ఇలా వింత రంగుల్లో గుడ్లు పెడుతుంటాయని తెలిపారు. గుడ్డు నాణ్యత, పోషక విషయాల్లో సాధారణ గుడ్లకు, ఇలాంటి రంగుల గుడ్లకు ఎలాంటి తేడా ఉండదని జంతు సంరక్షణ శాఖ అధికారులు చెప్పారు.
கர்நாடக மாநிலம் தாவணகெரே மாவட்டத்தில், ஒரு நாட்டுக்கோழி நீல நிற முட்டையிட்டுள்ளது. சையத் நூர் என்பவருக்குச் சொந்தமான இந்தக் கோழி, நீல நிற முட்டையை இட்டது அப்பகுதி மக்களிடையே பெரும் ஆச்சரியத்தை ஏற்படுத்தியுள்ளது.
— PttvOnlinenews (@PttvNewsX) August 28, 2025
இதுகுறித்து கால்நடைத்துறை உதவி இயக்குநர் டாக்டர் அசோக் கூறுகையில்,… pic.twitter.com/QS2BUtpehc
Also Read: మ్యూచువల్ ఫండ్స్‌లో పెద్ద మొత్తంలో లాభాలు రావాలంటే.. ఎన్ని యూనిట్లు ఎప్పుడు అమ్మాలంటే?
ఇక్కడ మరో విషయం ఏంటంటే కోళ్లు ఇలా నీలం రంగుల్లో గుడ్లు పెట్టడం కొత్తేం కాదని అధికారులు అంటున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో పెరిగే కొన్ని రకాల జాతుల కోళ్లు కూడా ఇలా నీలం, ఆకుపచ్చ రంగుల్లో గుడ్లు పెడుతుంటాయని చెబుతున్నారు. గతంలో ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. ఆ కోళ్లల్లో బిలవర్డిన్ అనే వర్ణద్రవ్యం ఎక్కవగా ఉండటం వల్లే ఈ రంగుల్లో గుడ్లు పెడతాయని అంటున్నారు.
Also Read: భారత్ చొరవ చూపించకపోతే ట్రంప్ వెనక్కి తగ్గరు..ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్