/rtv/media/media_files/2025/08/28/hassett-2025-08-28-08-46-14.jpg)
Indians should budge..Hassett warned
అమెరికా, భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. అదనపు సుంకాలతో ఇవి మరింత దిగజారాయని అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంలో భారతదేశమే వెనక్కు తగ్గాలని ఆయన అన్నారు. అమెరికా వస్తువుల కోసం భారత్ తన మార్కెట్ ను తెరవాలని సూచించారు. అలా అయితేనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విషయంలో వెనక్కు తగ్గుతారని హాసెట్ అన్నారు. పరోక్షంగా అమెరికా పాల ఉత్పత్తులను ఇండియా దిగుమతి చేసుకోవాలని ఆయన సూచించారు. భారత వాణిజ్య వైఖరిపై అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ నిరాశను వ్యక్తం చేశారు. ఆ దేశం మొండితనం ప్రదర్శిస్తోందని అన్నారు. వాళ్ళు ఇలాగే ఉంటే ట్రంప్ తన విధానాలను మరింత కఠినతరం చేస్తారని హాసెట్ హెచ్చరించారు.
అసలు కారణం పాల ఉత్పత్తులే..
ట్రంప్ అమలు చేసిన అదనపు సుంకాలకు కారణంగా అమెరికా పాల ఉత్పత్తులను మన దేశంలోకి అనుమతించకపోవడమేనని ప్రధాని మోదీతో సహా మిగతా అధికారులు చెబుతూనే ఉన్నారు. అయితే అమెరికా మాత్రం పైకి దీన్ని ఒప్పుకోవడం లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలే కారణమని చెబుతూ వస్తోంది. చివరకు ఇప్పుడు అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్ ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. అంతేకాదు అమెరికా వస్తువులకు భారత్ తన మార్కెట్ ను తెరవాలని సలహా కూడా ఇచ్చారు. ఇవన్నీ చెప్పాక చివరలో రష్యా, ఉక్రెయిన్ సంబంధం కూడా భారత్ పై అదనపు సుంకాలకు కారణమని అన్నారు. శాంతి ఒప్పందాన్ని సాధించడానికి మరియు లక్షలాది మంది ప్రాణాలను కాపాడటానికి రష్యాపై మేము తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ఒత్తిడికి ఇది కొంతవరకు ముడిపడి ఉందని చెప్పుకొచ్చారు. సుంకాలపై చర్చలు టైమ్ టేకింగ్ థింగ్ అని అన్నారు. దాంతో టైమ్ వేస్ట్ తప్ప పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు.
వారి సంబంధం సంక్లిష్టమైనది..
అంతకు ముందు అదనపు సుంకాల మీద అమెరికా, భారత్ రెండూ కలిపి ఒక నిర్ణయానికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్. ద్వైపాక్షిక సంబంధాలు చాలా క్లిష్టమైనవి...వాటిని వదులుకోవడానికి ఏ దేశం సిద్ధంగా ఉండదని అన్నారు. అయితే ఈ విషయంలో భారత్ కొంచెం ముందుకు రావాలని బెసెంట్ తెలిపారు. చర్చలకు ఆ దేశం సహకరించడం లేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ట్రంప్ మధ్య ఉన్న బంధాన్ని ప్రస్తావిస్తూ బెసెంట్ మాట్లాడుతూ, "ఇది చాలా సంక్లిష్టమైన సంబంధం. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ...రెండూ కలిసి ఉండడమే ఎప్పటికైనా మంచిదని..తొందరలోనే ఇరు దేశాలూ కలిసి వస్తాయని బెసంట్ ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూ ఢిల్లీ కూడా తమపై అత్యధిక సుంకాలను విధించిందని చెప్పారు. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమర్థించారు.