/rtv/media/media_files/2025/07/08/man-cheats-on-woman-under-married-2025-07-08-18-06-05.jpg)
Man cheats on woman under married
జీవితంలో అందర్నీ కోల్పొయిన ఒక అభాగ్యురాలు శేష జీవితంలో తనకో తోడు కావాలని కోరుకుంది. ఒక మ్యారేజ్ బ్రోకర్‌ద్వారా ప్రకటన ఇచ్చింది. తద్వారా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ, అతను నమ్మించి, ఆమెను వంచించి ఉన్నదంతా ఊడ్చుకొని పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Also Read: Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి
చిత్తూరు జిల్లా, రామకుప్పం మండలం, రాజుపేట కు చెందిన నాగమణి (50) 25 సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన వెంకటప్ప రెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఓ మగ సంతానం. అయితే 15 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందాడు. కుమారుడి మృతితో మనస్థాపానికి గురై ఆ బాధను తట్టుకోలేక 10 సంవత్సరాల క్రితం వెంకటప్ప రెడ్డి మృతి కూడా మృతి చెందాడు.
Also Read : CRIME : ఛీ.. నువ్వు ఒక తండ్రివేనా? కన్నబిడ్డను తల్లిని చేసిన కసాయి తండ్రి
Illegal Crime
కట్టుకున్న భర్త ,కన్న కుమారుడు చనిపోవడంతో నాగమణి ఒంటరిగా జీవితం గడుపుతోంది. శేష జీవితంలో తోడు కోసం పెళ్లి బ్రోకర్ ద్వారా ప్రకటన ఇచ్చారు. బంగారుపాలెం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్ (40) కరోనాతో తన భార్య చనిపోయిందని నమ్మించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నాగమణిని ఓ గుడిలో పెళ్లి చేసుకున్న శివకుమార్ ఆ తర్వాత నాగమణి వద్ద ఉన్న మూడు కోట్ల రూపాయలను శివప్రసాద్ అన్న వదినలకు ట్రాన్స్‌ఫర్ చేయించాడు.
Also Read : తెలంగాణలో ఘోరం.. భర్తను గొడ్డలితో నరికి ఖతం చేసిన ఇద్దరు భార్యలు
అంతే కాక ఆర్బీఐ వద్ద తనకు రూ.1700 కోట్లు రావలసి ఉందని నమ్మించి అందుకు 15 కోట్లు పన్ను చెల్లించాలంటూ నాగమణిని మోసం చేసి బెంగళూరులో నాగమణికి చెందిన రూ.10 కోట్ల విలువైన భూమి, రూ.15 కోట్ల అపార్ట్మెంట్ విక్రయించడంతో పాటు రూ.3 కోట్లు తీసుకుని పారిపోయాడు. నాగమణి బ్రోకర్ ద్వారా శివప్రసాద్ ఆచూకీ కనుగొనడంతో పాటు అతనికి భార్యపిల్లలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో చిత్తూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన నాగమణి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read : రేవంత్ రెడ్డికి చర్చ చేయడం రాదు.. అందుకే ఢిల్లీకి పారిపోయిండు..కేటీఆర్ కీలకవ్యాఖ్యలు
marrige | Chittoor Wife and Husband | chittoor news | chittoor district news | chittoor crimes news | chittoor-district | chittoor