/rtv/media/media_files/2025/08/18/pakistan-navy-2025-08-18-15-29-52.jpg)
Pakistan Navy
పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్ పాక్‌పై ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరుతో ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు దూర ప్రాంతాలకు తరలివెళ్లిపోయాయి. కరాచీ నౌకాశ్రయంలో ఉండాల్సిన వార్‌షిప్స్‌లో కొన్ని కమర్షియల్ టెర్మినల్స్‌కి వెళ్లిపోయాయి. మిగిలినవి ఇరాన్ బార్డర్‌లోకి వెళ్లాయి. వీటికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు కూడా విడుదలయ్యాయి.
Also Read: అటు రష్యా.. ఇటు ట్రంప్.. మధ్యలో నలిగిపోతున్న జెలెన్స్కీ.. ఉక్రెయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే!?
Operation Sindoor Peaked - Pakistan Navy
మే 8 నాటి శాటిలైట్ చిత్రాలను గమనిస్తే కరాచీ పోర్ట్‌లో నౌకలు లేవు. మే 10న 7 వార్‌షిప్‌లు 100 కిలోమీటర్ల దూరంలోని గ్వదార్ పోర్టులో కనిపించాయి. ఇందులో జుల్ఫికర్ శ్రేణి ఫ్రిగెట్లు సైతం ఉన్నాయి. వీటిని చైనాలో తయారుచేశారు. అయితే ఆపరేషన్ సిందూర్‌కు ఆరు నెలల ముందు చైనా నుంచి నాలుగు జుల్ఫికర్ శ్రేణి నౌకలను తీసుకొచ్చారు. అంతేకాదు నౌకల ప్రారంభోత్సవ సమయంలో పాకిస్థాన్ యాంటీషిప్ మిసైన్స్‌ను ప్రయోగించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేసింది. కానీ భారత్, పాక్ మధ్య ఘర్షణలు చెలరేగడంతో.. ఇవి కరాచీ పోర్టును వదిలివెళ్లిపోయాయి.
Also Read: జెలెన్స్కీకి ట్రంప్ బిగ్ షాక్.. ఉక్రెయిన్ అందులో చేరవద్దని సీరియస్ వార్నింగ్!
Visual imagery show Pak Navy ships docked in Gwadar during Op Sindoor.@AnkiitKoomar gives visual details |@snehamordani#News#OpSindoor#India#Pakistanpic.twitter.com/qxkVK7zEA3
— IndiaToday (@IndiaToday) August 18, 2025
ఇదిలాఉండగా 1971లో భారత్-పాక్ యుద్ధం(Ind-Pak War) జరిగినప్పుడు కూడా భారత సైన్యం కరాచీ పోర్ట్‌ను టార్గెట్ చేసుకున్నాయి. ఆపరేషన్ పైథాన్ పేరిట దానిపై దాడులు చేశాయి. ఆ సమయంలో ఓ ఫ్లీట్ ట్యాంకర్ అలాగే చమురు డిపోలు పూర్తిగా నాశనమయ్యాయి. అంతేకాదు పలు వాణిజ్య నౌకలు కూడా మునిగిపోయాయి.
ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ యుద్ధంలో తాను వీర మరణానికి ప్రాధాన్యం ఇస్తానని వ్యాఖ్యానించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యులో ఆయన దీని గురించి మాట్లాడారు. '' దేవుడు నన్ను దేశ రక్షణ కోసమే పుట్టించాడు. దీనికి మించి నాకు కావాల్సింది ఏమీ లేదు. నేను సైనికుడిని, వీర మరణమే నా ఆకాంక్ష''అని మునీర్ అన్నారు. ఇక ఆపరేషన్ సిందూర్ సమయంలో మే 10న నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత దళాలు దాడులు చేసినప్పుడు మునీర్ ఓ రహస్య బంకర్‌లో దాక్కున్నట్లు నెటినజ్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
Also Read: ఇండియా-పాక్‌లపై ఓ కన్నేసిన అమెరికా.. మార్కో రూబియోమ షాకింగ్ కామెంట్స్