BIG BREAKING: జెలెన్స్కీకి ట్రంప్ బిగ్ షాక్.. ఉక్రెయిన్‌ అందులో చేరవద్దని సీరియస్ వార్నింగ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌లో "ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తలుచుకుంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం వెంటనే ఆపగలరు, యుద్ధం ఆగడం లేదా కొససాగడం అనేది జెలెన్స్కీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ట్రంప్ ట్వీట్ చేశారు.

New Update
Trump tweets to Zelensky

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన చేసిన ట్వీట్‌లో "ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తలుచుకుంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం వెంటనే ఆపగలరు, యుద్ధం ఆగడం లేదా కొససాగడం అనేది జెలెన్స్కీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ యుద్ధం ఎలా మొదలైందో గుర్తుంచుకోవాలని, ఒబామా కాలంలోనే క్రిమియాను స్వాధీనం చేసుకున్నారని, అప్పుడు ఒక్క తుపాకీ కూడా పేలలేదని ట్రంప్ తన ట్వీట్‌లో ప్రస్తావించారు.

అలాగే, ఈ వివాదాస్పద ట్వీట్‌లో ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకూడదని కూడా ట్రంప్ పేర్కొన్నారు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవని, ఉక్రెయిన్ నాటోలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన పరోక్షంగా సూచించారు.

ట్రంప్ వ్యాఖ్యలు జెలెన్స్కీపై ఒత్తిడి పెంచడానికి, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా తన వైఖరిని మార్చుకునేందుకు సిద్ధంగా ఉందని సూచిస్తున్నాయి. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు తెలుస్తోంది. వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జరిగిన చర్చల్లో జెలెన్స్కీ ఆగ్రహంతో బయటకు వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. రష్యాతో శాంతి చర్చలు జరపడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉన్నప్పటికీ, తన భూభాగాన్ని రష్యాకు అప్పగించే ప్రసక్తి లేదని జెలెన్స్కీ స్పష్టం చేశారు.

అటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ట్రంప్‌తో చర్చలకు సిద్ధమని చెప్పినప్పటికీ, యుద్ధాన్ని ముగించేందుకు తమకు పూర్తి హక్కులు ఉన్నాయని, ఇతర దేశాల జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పారు. మొత్తానికి, ట్రంప్ ట్వీట్ ప్రపంచ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు