గత కొంతకాలంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈవీలంను బ్యాన్ చేసి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే తాజాగా జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ అంశంపై స్పందించారు. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ చేస్తున్న అభ్యంతరాలను ఆయన తప్పుబట్టారు. గెలిచినప్పుడు ఒకలా ఓడినప్పుడు వాటిని నిందించడం సరికాదన్నారు. Also Read: ఆప్ తుది జాబితా విడుదల.. కేజ్రీవాల్, అతిషి ఎక్కడి నుంచి పోటీ అంటే ? Omar Abdullah ఓటింగ్ విధానంపై నమ్మకం లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చిన అంగీకరించాలన్నారు. '' EVMలలో ఏదైనా సమస్య ఉంటే వాటిపై పోరాడాలి. వాటి సాయంతో 100 సభ్యులు గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటారు. కొన్ని నెలల తర్వాత మాట మార్చి మేము ఆశించిన విధంగా ఫలితాలు రాలేవని ఈవీఎంలపై విమర్శిస్తుంటారు. Also Read: జమిలి ఎన్నికల బిల్లుకు బ్రేక్.. పునరాలోచనలో పడ్డ కేంద్రం ఫలితాలకు EVMలతో సంబంధం లేదు. ఓటమికి వీటిని సాకుగా చూపించకూడదు. ప్రజలు ఒక్కోసారి ఒక్కో వ్యక్తిని ఎన్నుకుంటారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో నేను ఓడిపోయాను. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాను. ఇదే ఓ ఉదాహరణ. నేను పక్షపాత ధోరణితో కాకుండా నియమాలు అనుసరించి మాట్లాడుతా. సెంట్రల్ విస్టా వంటి ప్రాజెక్టులకు మద్దతిచ్చాను. కొత్త పార్లమెంటు భవన నిర్మాణం అద్భుతమైన ఆలోచన''అని ఒమర్ అబ్దుల్లా అన్నారు. Also Read: మాజీ అధ్యక్షుడు అసద్ అరాచకాలు..బందీలను పెంపుడు సింహాలకు ఆహారం ఇదిలాఉండగా.. ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. అమెరికా, యూకే లాంటి దేశాల్లో బ్యాలెట్ విధానం ఉందని.. ఇండియాలో ఎందుకు ఉండకూడదంటూ ప్రశ్నిస్తోంది. ఇక జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 సీట్లలో గెలవగా.. కాంగ్రెస్ కేవలం ఆరు స్థానాలకే పరిమితమైంది. Also Read: సీఎంకి తలనొప్పిగా మారిన నాటుకోడి చికెన్ వివాదం.. వీడియో వైరల్!